Pages

Monday, August 27, 2012

గోపి కల

అనగనగా ఒక ఊర్లో 'గోపి' అనే పిల్లవాడు ఉండేవాడు. గోపి బొమ్మలు చాలా బాగా వేస్తాడు. గోపికి ఒక చెల్లి ఉంది. ఆ పాప పేరు హరిత. గోపి 6వతరగతి చదువుతున్నాడు. హరిత 3వతరగతి చదువుతున్నది.

ఒక రోజు రాత్రి గోపి, హరిత, వాళ్ల అమ్మ అందరూ పడుకున్నారు. అప్పుడు గోపికి ఒక కల వచ్చింది:

అది ఏమిటంటే, "ఒక ఊరు ఉందట. ఆ ఊరు నది పక్కన ఉందట. ఆ ఊరిలో ఒక పూరిగుడి సె ఉంది. అందులో ఒక అవ్వ, అమ్మ, బాబు ఉండేవాళ్లు. వాళ్ళకి ఒక గాడిద కూడా ఉండేది. ఒక రోజు పెద్ద తుఫాను ఒకటి వచ్చింది. విపరీతంగా వర్షం కురిసింది. వాళ్ళుండే పూరిగుడిసె లోకి నీళ్ళు రావటం మొదలుపెట్టాయి. అప్పుడు అమ్మ, అవ్వ, బాబులకు ఏమిచెయ్యాలో అర్థం కాలేదు. ఇక ఆ ఊరు విడిచిపెట్టి పోవడానికే నిశ్చయించుకున్నారు వాళ్ళు. తమతో పాటు గాడిదను కూడా వెంట తీసుకుపోయారు. అట్లా పోతూ పోతూ‌ వాళ్ళు గోపి వాళ్ళ ఇంటి ముందునుండే పోతున్నారు.

కిటికీలోంచి వాళ్ళని చూసాడు గోపి- "ఇదేంటి, వీళ్ళు ఎక్కడికి పోతున్నారు, ఇంత వానలో?" అనుకొని, వాళ్ళని తమ ఇంట్లోకే పిలిచాడు. తాము ఉండే చిన్న ఇంట్లోనే వాళ్ళకీ‌ ఉండేందుకొక చోటు చూపించాడు" అంతలో కల అయిపోయింది. గోపికి మెలకువ వచ్చేసింది కూడా.
మరుసటి రోజున గోపి తన కలకి సంబంధించి మంచి బొమ్మనొకదాన్ని వేశాడు. బొమ్మ చక్కగా వచ్చింది. 'కానీ దాన్ని ఏం చెయ్యాలి?' అప్పుడు గుర్తుకొచ్చింది వాడికి- "రేపు రాఖీపండుగ కదా, హరిత నాకు రాఖీ కట్టిన తర్వాత నేను తనకు ఈ బొమ్మనే బహుమతిగా ఇస్తే భలే బాగుంటుంది!"

మరునాడు గోపి అనుకొన్నట్టే "అన్నా, ఇటు రారా" అని పిలిచి రాఖీ కట్టింది హరిత. గోపి నవ్వి, తను గీసి పెట్టిన ఆ బొమ్మను హరితకు కానుకగా ఇచ్చాడు.

హరితకి ఆ బొమ్మ ఎంత బాగా నచ్చిందంటే చెప్పలేం! అప్పటినుండీ హరితకు గోపికి పండుగ అంటే రాఖీపండగే. ప్రతి సంవత్సరం రాఖీ పండుగ కోసం ఎదురుచూస్తూంటారు వాళ్ళిద్దరూ. హరిత తను సొంతగా తయారు చేసిన రాఖీలు కడుతుంటుంది; గోపీ తను గీసిన బొమ్మల్ని చెల్లికి కానుకగా ఇస్తుంటాడు!

జీవనాధారం

అనగనగా ఒక కమలమ్మ, ఆమె కొడుకు రాము ఉండేవాళ్ళు. ఒక ముసలి అవ్వ తప్పిస్తే వాళ్లకు నా అన్నవాళ్ళే ఎవరూ‌ ఉండేవాళ్ళు కారు. ఒకసారి వాళ్ళుండే ఊళ్ళో విపరీతమైన కరువు వచ్చింది. దాంతో వాళ్ళు వేరే ఊరికి వలస పోవలసి వచ్చింది.

అట్లా వాళ్ళు దోవ వెంబడి పోతూ ఉంటే దారిలో వాళ్లకొక గాడిద కనిపించింది. దాని యజమానులెవరో దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినట్లున్నారు; అది బక్క చిక్కిపోయి, ఆకలికి నకనకలాడుతున్నట్లు ఉంది, బలహీనంగా. దాన్ని చూడగానే రవి చాలా ముచ్చటపడ్డాడు. "ఆ గాడిదను పెంచుకుందాం అమ్మా" అని అడిగాడు. కమలమ్మ ఒప్పుకోలేదు. "తింటానికి మనకే ఏమీ లేదు; ఇంక దాన్నెట్లాగ, సాకేది?" అన్నది.

కానీ రాము బ్రతిమిలాడాడు. దాంతో‌ కొద్ది సేపటికి ఆమె మెత్తపడి "సరే, కానియ్యి. కానీ దాన్ని చూసుకునే బాధ్యత నీదే. అది చచ్చిపోతే మటుకు నన్ను ఏమీ అనకు" అంది.

రాము సంతోషంగా పోయి దాన్ని వెంట పెట్టుకొని వచ్చాడు. అక్కడక్కడా నిలచి ఉన్న చెట్లలోంచి కొన్ని ఆకుల్ని కోసి దానికి తినిపించాడు. అది వాటిని నముల్తూ, వాళ్ళవెంట నడవసాగింది. కొద్ది దూరం పోయాక రాము తన నెత్తి మీద ఉన్న మూటను దాని మీదే వేశాడు- అది అలవోకగా ఆ బరువును మోస్తూ పోయింది.

రాము వాళ్ళు ఎంత దూరం పోయినా కరువు ఛాయలు పోనే లేదు. చివరికి వాళ్ళు ఏదో ఒక ఊరు చేరుకున్నారు. ఆ సరికి సాయంత్రం కావస్తున్నది. అవ్వ, కమలమ్మ ఇద్దరూ ఒక చెట్టుక్రింద బిచాణా పరచి, మూడు రాళ్ళ పొయ్యిలో వంట మొదలు పెట్టారు.

అంతలో ఊళ్ళోంచి ఒకాయన వచ్చి వాళ్ళ ముందు నిలబడి, "ఊళ్ళో చాకలి వాళ్ళు లేక చాలా కష్టంగా ఉంది- మీరు వచ్చారు గనక ఇక బాధే లేదు. రేపు ఉదయాన్నే మా బట్టలొక ఇరవై పంపుతాను- ఉతికి త్వరగా వెనక్కి ఇచ్చేయాలి మరి" అన్నాడు.

కమలమ్మకు ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు- ఎందుకంటే వాళ్ళు అసలు చాకలివాళ్ళు కాదు గద! ఉన్న ఊళ్ళో గడవక, కడుపు చేతబట్టుకొని వచ్చారు వాళ్ళు. అయితే తమతోబాటు ఉన్న గాడిదను చూసి ఆయన అట్లా అనుకున్నట్లుంది. 'ఏదో ఓ బ్రతుకు తెరువు- బట్టలు ఉతికితే కాసిని డబ్బులు వస్తాయి కదా, బ్రతుక్కోవచ్చు' అని ఆమె "సరేలెండి సార్! అలాగే కానివ్వండి" అన్నది.

మరునాటికల్లా ఊళ్ళో అందరికీ తెలిసింది- 'ఎవరో చాకలివాళ్ళట, వచ్చి ఉన్నారు- బట్టలు బాగా ఉతుకుతారట! ఏ కాసిని డబ్బులు ఇచ్చినా చాలట!' అని. ఇక అందరూ వాళ్ల వాళ్ల బట్టలు తెచ్చి వేయటం‌ మొదలు పెట్టారు. కమలమ్మ కు, అవ్వకు చేతినిండా పని దొరికింది. రెండు మూడు రోజుల్లో గాడిద బాగా కోలుకున్నది కూడాను. బాగా అనుభవం ఉన్న గాడిద అవ్వటంతో అది వీళ్లకు చాలా సేవ చేసింది. అమ్మ, అవ్వ, రాము ముగ్గురూ ఒళ్ళు వంచి పని చేశారు. రాము గాడిదను వెంటబెట్టుకొని వెళ్ళి ఇంటింటినుండీ బట్టలు సేకరించుకొని వచ్చేవాడు. అట్లాగే ఉతికిన బట్టలు తీసుకెళ్ళి ఇచ్చేవాడు. అమ్మ, అవ్వ ఇద్దరూ వంక దగ్గర బట్టలు ఉతకటం‌ మొదలు పెట్టేసారు.

కరువు కారణంగా ఎలా బ్రతుక్కోవాలో అర్థంకాక వలస పోయిన ఆ కుటుంబానికి ఇప్పుడు మూడుపూట్ల భోజనం దొరకటం మాత్రమే కాదు- ఒక్క సంవత్సరంలో సొంత ఇల్లు కూడా‌ ఏర్పడింది. మరుసటి సంవత్సరం నుండీ రాము బడికి వెళ్ళి చదువుకోవటం కూడా మొదలు పెట్టాడు.

అంతేకాదు; ఇప్పుడు వాళ్ళకు జీవితం అంటే భయం పోయింది-తమ శక్తి యుక్తుల పట్ల గౌరవం ఏర్పడింది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికెళ్ళినా చాకలి పని చేసుకొని పొట్టపోసుకోగలరు. 'దేనికీ పనికి రాదు' అనుకున్న గాడిదే ఇప్పుడు వాళ్ళకి జీవనాధారమూ, జీవన స్ఫూర్తీ అయ్యింది!

తెలివి తేటలు

సోమయ్య ,రాజయ్య, బసవయ్య ముగ్గురూ చాలా తెలివైనవాళ్లని ప్రతీతి. ఆ ఊరిలోనే వీళ్లంత తెలివైనవాళ్ళు లేరు.

వాళ్ళు ముగ్గురికీ ఒకసారి అనిపించింది-"ఇంత తెలివి తేటలు ఉన్నవాళ్లం; ఒకసారి రాజుగారి మెప్పు పొందితే బాగుంటుంది కదా" అని, ముగ్గురూ బయలుదేరి రాజుగారి దగ్గరికి వెళ్ళారు.

"మహారాజా! మేం ముగ్గురం మా తెలివితేటల ఆధారంగా అనేక సమస్యల్ని పరిష్కరించాం. ఇన్నేళ్లకు మీ మెప్పు పొందాలని వచ్చాం. మా తెలివిని పరీక్షించి తగిన బహుమతులు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం" అన్నారు.

"ఓ, తప్పకుండా! అలాగే చేద్దాం" అన్నాడు రాజు, భటులను పిలిచి వారికి ఏదో చెబుతూ.

రాజ భటులు ఒక పెద్ద పెట్టెను తెచ్చి అక్కడ దింపారు- "సరే, తెలివిగల పిల్లలూ, ఇప్పుడు చెప్పండి, ఈ పెట్టెలో ఏముంది?" అని వాళ్ళు ముగ్గురినీ అడిగాడు రాజు.
ముగ్గురూ ఒక్కసారిగా అన్నారు: "అందులో మామిడి పళ్ళు ఉన్నాయి!" అని.

రాజయ్య అన్నాడు- "అందులో నిండా పళ్ళు లేవు ప్రభూ! కొన్ని పళ్ళు మాత్రమే ఉన్నై" అని.

బసవయ్య అన్నాడు- "అవునవును- అందులో మహా ఉంటే ఒక డజను పళ్ళు ఉన్నై" అని.

రాజుగారి ఆజ్ఞ మేరకు పెట్టెని తెరిచారు భటులు- చూస్తే అందులో నిజంగానే డజను మామిడిపళ్ళు ఉన్నాయి! సభికులందరూ ఆశ్చర్యపోయారు.

" 'ఇందులో మామిడి పళ్లే ఉన్నాయి' అని మీకు ఎలా తెలిసింది?" అడిగాడు రాజు.

సోమయ్య అన్నాడు- "ప్రభూ! మామిడిపళ్ళు అంత చక్కని వాసన వేస్తుంటే మరొక ఆలోచన ఎలా వస్తుంది? నేను వాసనను బట్టి ఇవి మామిడి పళ్ళేనని కనుకొన్నాను" అని.

"వాసన ఎలాగూ ఉన్నది- భటులు పెట్టెను తెస్తున్నప్పుడు వాళ్ళు అసలు కష్టపడలేదు- అలవోకగా మోసుకొచ్చారు. దాన్ని బట్టి పెట్టె నిండుగా లేదని అర్థమైంది నాకు" అన్నాడు రాజయ్య.

"ప్రభూ! వాళ్లు పెట్టెను క్రిందికి దింపేటప్పుడు వచ్చిన శబ్దాన్ని బట్టి నేను అందులో సుమారు ఒక డజను పళ్ళు ఉంటాయని ఊహించాను" నవ్వాడు బసవయ్య.

రాజుగారికి వాళ్ళ తెలివితేటలు చాలా నచ్చాయి. ముగ్గురినీ సత్కరించటమే కాక, వారిని తన ఆంతరంగిక సలహాదార్లుగా నియమించుకున్నారు.

కథలో కథ

ఒకరోజు సాయంత్రం అవ్వ, అమ్మ, బాబు చెరువు గట్టుమీద నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నారు. చెరువులో చాలా అందమైన పువ్వులు ఉన్నాయి. సూర్యుడు అప్పుడే అస్తమిస్తున్నాడు. వాతావరణం చాలా బాగున్నది. "అవ్వా, అవ్వా! ఓ మంచి కథ చెప్పవూ?" అని అవ్వ దగ్గరికి వెళ్ళాడు బాబు. "ఇక్కడ కూర్చొని కథలు చెప్పుకుంటూంటే చీకటి పడిపోదూ? ఇంటికెళ్ళాక చెప్పుకుందాంలే" అంది అవ్వ. "కాదు, ఇప్పుడే ఓ చిన్న కథ చెప్పు, రాక్షసుడి కథ" అని పట్టు పట్టాడు బాబు. అమ్మ, బాబు చెట్టుకింద కూర్చొని కథ వింటుంటే, అవ్వ కథ చెప్పటం మొదలుపెట్టింది ఇలాగ-

"అనగనగా ఒక రాజ్యంలో ఒకరాజు ఉన్నాడు. అతను చాలా మంచివాడు. ప్రజలకి సాయం చేస్తూఉంటాడు. ఒకరోజున ఆ రాజ్యంలోకి ఒక పెద్ద రాక్షసుడు వచ్చి ప్రజలను తినడం మొదలుపెట్టాడు. రోజుకో ఇంటికి వెళ్ళి తనకిష్టమైన వారిని తింటున్నాడు వాడు.

అట్లా ఒకరోజున వాడు రాజు గారి ఇంటికి వెళ్ళి "నాకు ఆకలిగా ఉంది- నీ కూతురు కావాలి" అన్నాడు. అంత పెద్ద రాక్షసుడిని చూసి రాజుకూడా భయపడ్డాడు. వాడికి ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాలేదు ఆయనకు. అప్పుడు రాక్షసుడే అన్నాడు- నీ బిడ్డని రక్షించుకునేందుకు నీకు ఒక అవకాశం ఇస్తాను. నేను ఒక ప్రశ్న అడుగుతాను. దానికి సరైన సమాధానం చెబితే నీ కుమార్తెను వదిలివేస్తాను. తప్పు సమాధానం చెప్పిన వాళ్ళని నాకు ఆహారంగా ఇవ్వాలి నువ్వు" అని చెప్పాడు రాక్షసుడు.

రాజు "సరే ఆ ప్రశ్న ఏమిటో అడుగు" అన్నాడు.

"పొద్దున నాలుగు కాళ్లతో నడుస్తుంది, మధ్యాహ్నం రెండుకాళ్ళతో నడుస్తుంది, రాత్రి మూడు కాళ్ళతో నడుస్తుంది- ఏమిటది?" అడిగాడు రాక్షసుడు. రాజుకు ఆ ప్రశ్నకు సరైన సమాధానం తెలియలేదు . తెల్ల మొఖం వేశాడు. రాక్షసుడు నవ్వాడు- "పో, మరి దీనికి సరైన సమాధానం చెప్పమని ఊరంతా దండోరా వేయించు" అన్నాడు.

రాజ్యంలో ఎవ్వరికీ ఆ ప్రశ్నకు సరైన సమాధానం తెలియలేదు. తప్పు సమాధానం చెప్పినవాళ్లను అందరినీ రాక్షసుడు భోంచేసేడు. రాజ్యంలో ఉన్న పెద్దవాళ్ళు, యువకులు సగం మంది రాక్షసుడికి భోజనం అయిపోయారు. "ఎలాగబ్బా, వీడిని ఓడించేది ఎవరు?" అని రాజు ఆలోచనలో పడ్డాడు.

చివరికి ఒకబాబు ముందుకు వచ్చాడు- "నీ ప్రశ్నకు సమాధానం నేను చెప్తాను. అది తప్పైతే నువ్వు ఎలాగూ నన్ను తినేస్తావు. మరి ఒకవేళ అది సరైన జవాబు అయితేనో?" అన్నాడు.

"నీలాంటి బుడతల్ని చాలా మందిని చూశానురా, దీనికి సరైన సమాధానం నువ్వు ఊహించలేవు. అయినా ఒకవేళ నీ జవాబు సరైనదే అనుకో, అప్పుడు నేను ఈ లోకం నుండే వెళ్ళిపోతాను- సరేనా?" అన్నాడు రాక్షసుడు గర్వంగా.

ఆ బాబు చెప్పాడు: "నీ ప్రశ్నకు సమాధానం- 'మనిషి' " అని. "మనిషి తన జీవితం ప్రారంభంలో నాలుగు కాళ్లమీద పారాడతాడు. నడిమి వయసులో రెండు కాళ్లమీద నడుస్తాడు. ఇక ముసలితనం వచ్చేసరికి కట్టె పట్టుకొని మూడుకాళ్లతో మళ్ళాడుతాడు- అంతేగా?" అన్నాడు. ఆ సమాధానం సరైనదేగదా, మరి రాక్షసుడు తను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అందుకని వాడు కొండపైకి ఎక్కి ఒక పెద్ద రాయికి తన తలని గుద్దుకుని చచ్చిపోయాడు. రాజు, రాజ్యంలోని వాళ్లందరూ ఆ బాబుని మెచ్చుకున్నారు.

అవ్వ కథ ముగించి చూసేసరికి చంద్రుడు వచ్చేశాడు- బాబు, వాళ్ళ అమ్మ ఇద్దరూ చందమామని చూస్తూ ఆ చెరువు గట్టునే నిద్రపోయి ఉన్నారు!

ఎక్కడినుండి ఎక్కడికి!

చాలా రోజుల క్రితం ఒక ఊళ్లో రంగారావు అనే యువకుడు ఒకడు ఉండేవాడు. పట్నంలో అతనికి ఓ చిన్న స్థలం ఉండేది. అందులో కనీసం ఒక్క గదైనా కట్టాలని అతనికి బలే కోరిక. పట్నంలో గది కట్టాలంటే కనీసం పది వేల రూపాయలైనా ఉండాలి. కానీ రంగారావు దగ్గర ఏనాడూ అంత డబ్బు జమ కాలేదు.

ఒక రోజున రంగారావు పొలం దున్నుతున్నాడు. అకస్మాత్తుగా అక్కడ అతనికి ఒక బంగారు నాణెం దొరికింది. "అబ్బ బంగారు నాణెం! దీంతో నా అవసరాలన్నీ తీరతాయి!" అనుకొని అతను పని ఆపి, దాన్ని జేబులో వేసుకొని ఇంటికి బయలు దేరాడు.

ఇంటికిపోతుంటే, దారి మధ్యలో ఒక ముసలాయన ఎదురు పడ్డాడు రంగారావుకు. ఒక గాడిదను తోలుకొని వస్తున్నాడాయన. "నాయనా! చాలా ఆకలిగా ఉంది. రెండు రోజులుగా ఏమీ తినలేదు. నీకు మేలు జరుగుతుంది- నీ దగ్గర ఏమైనా ఉంటే దానం చెయ్యి బాబూ" అన్నాడు ముసలాయన, రంగారావుతో.

సంతోషంగా ఉన్న రంగారావుకు అబద్ధం చెప్ప బుద్ధి కాలేదు. "పోనీలే, ఇది నాకు దొరకలేదనుకుంటాను" అని అతను తన జేబులోని బంగారు నాణెం తీసి ఆ ముసలాయనకి ఇచ్చేశాడు.

"చాలా గొప్ప పని చేశావు నాయనా, దీనితో నా అవసరం నెరవేరుతుంది. ఇదిగో, ఈ గాడిద చాలా మంచిది. దీన్ని నువ్వు తీసుకెళ్ళు" అని ఆ ముసలాయన తన గాడిదను రంగారావుకు ఇచ్చి ముందుకు సాగాడు.

రంగారావుకు ఆ గాడిదను ఏం చెయ్యాలో అర్థం కాలేదు. వద్దన్నా వినేట్లు లేదు, ముసలాయన. అందుకని అతను దాన్ని తోలుకొని ఇంటికి పోయాడు.

ఇంటికి పోయేసరికి అక్కడ పరిస్థితి గందరగోళంగా ఉన్నది. వాళ్ల పక్కింటి వాళ్ళు వేరే ఏదో ఊరికని బయలు దేరి ఉన్నారు. తీరా సమయానికి బండి జాడ లేదు!

"దానిదేముంది, ఇదిగో ఈ గాడిద ఉంది కదా, మీ సామాన్లను దీనిమీద తీసుకెళ్దాం, రండి" అని రంగారావు వాళ్ల సామాన్లన్నిటినీ పొరుగూరు చేర్చాడు. వాళ్ళు చాలా సంతోషపడి, అతనికి ఒక వందరూపాయలు ఇచ్చి, భోజనం కూడా పెట్టి పంపారు.

వెనక్కి వస్తూ ఒకచోట విశ్రాంతిగా కూర్చున్నాడు రంగారావు. అంతలోనే ఒక చిన్న పిల్లవాడి ఏడుపులూ, వాళ్ల అమ్మ అరుపులు వినపడ్డాయి. రంగారావుకి జాలివేసింది. "పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడమ్మా?" అని అడిగాడు. "చూడు నాయనా, మా బండి చక్రం విరిగి అవతల ఎక్కడో నిలిచి పోయింది. నడక తప్పితే ఇక వేరే మార్గం లేదు మాకు. వీడేమో నడవనని మారాం చేస్తున్నాడు" అంది ఆ తల్లి.

"అయ్యో, దానిదేముందమ్మా, నా గాడిద మీద కూర్చోబెట్టండి వాడిని. చిటికెలో అందరం పట్నం చేరుకుందాం" అన్నాడు రంగారావు ఆ పిల్లవాడిని సముదాయిస్తూ. పిల్లవాడు సంతోషంగా గాడిదనెక్కి కూర్చున్నాడు. పట్నం చేరాక వాళ్ల నాన్న రంగారావుకు బలవంతంగా వందరూపాయలు ఇవ్వటమే కాక, "నీకు ఏ అవసరం వచ్చినా నన్ను అడుగు, సంకోచించకు" అని మాట కూడా ఇచ్చాడు.

"ఏదైనా ఒక చిన్న పని ఇప్పించారంటే, మీ పేరు చెప్పుకొని బ్రతుక్కుంటాను" అన్నాడు రంగారావు వినయంగా. "పనిదేముంది, మన సైకిల్ షాపులోనే పని చెయ్యి. నీ పనిని బట్టి ఎంతో కొంత జీతం ఇస్తానులే" అన్నాడు ఆ పెద్దమనిషి!

అలా రంగారావు సైకిల్ షాపులో పనికి కుదురుకున్నాడు; వళ్ళు వంచి ఇష్టంగా పని చేయటం మొదలు పెట్టాడు. నెల తిరిగేసరికి రంగారావుకి రెండువేలు జీతంగా ఇచ్చాడు షాపు యజమాని. "అంత డబ్బు వద్దండీ, ఖర్చులకు ఎంతో‌ కొంత ఇవ్వండి చాలు" అన్నాడు రంగారావు. యజమాని అతనికి ఖర్చులకు డబ్బు ఇచ్చి, మిగతా సొమ్మును అతని పేరనే బ్యాంకులో వేశాడు.

సంవత్సరం తిరిగే సరికి రంగారావు పేర బ్యాంకులో ఇరవైవేల రూపాయలు జమ అయ్యాయి. ఆ డబ్బుతో అతను తన స్థలంలో‌ చిన్న ఇల్లు ఒకటి కట్టుకోగలిగాడు!

సూరి తోట

సూరికి అందమైన తోట ఒకటి ఉండేది. ఆ తోటలో రకరకాల పక్షులు ఉండేవి. అతను రోజూ తోటకు వెళ్ళి చెట్లకు నీళ్ళు కట్టి వచ్చేవాడు. ఒక రోజు తోటకి పోయి చూస్తే తోటంతా నిశ్శబ్దంగా ఉంది. పక్షులన్నీ మూగపోయి ఉన్నాయి.

"రోజూ ఎన్ని పక్షులు ఉండేవి! ఈ రోజు తగ్గిపోయినట్లున్నాయే! ఎవరో ఈ పక్షులను తినేస్తున్నారు. పట్టుకోవాలి" అనుకొని, సూరి ఆ రాత్రికి తోటలోనే పడుకున్నాడు.

రాత్రి 9గంటల ప్రాంతంలో పెద్ద గ్రద్ద ఒకటి వచ్చింది ఎక్కడినుండో. వచ్చీ రాగానే అది ఒక పక్షిపిల్లని తినేసింది! దాన్నే గమనిస్తున్న సూరి కోపం పట్టలేక ఆ గద్ద మీదికి దూకాడు. తన చేతిలో ఉన్న కట్టెతో దాని ముఖానికి నాలుగు అంటించాడు.

అయితే అది మామూలు గ్రద్ద కాదు- సూరితో సహా ఆకాశంలోకి ఎగిరింది అది. పోయి పోయి ఒక సముద్రంలోకి దూకింది!

గద్ద మీద ఉన్న సూరి కూడా సముద్రంలోకి జారిపోయాడు. గ్రద్ద ఎక్కడికి వెళ్ళిందో‌ తెలీదు. సూరి మటుకు ఈదుకుంటూ ఒక దీవిని చేరుకున్నాడు. ఆ ప్రదేశం చాలా అందంగా ఉంది. చాలా చెట్లు, మొక్కలు, తీగలు దట్టంగా పెరిగి ఉన్నై.

అంతలో‌ అకస్మాత్తుగా అతనికి ఒక ఎలుగుబంటి అతనికి ఎదురైంది! దాన్ని చూసి సూరి చాలా భయపడ్డాడు. కానీ అది వాడితో తెలుగులో మాట్లాడింది! "భయపడకు" అని అది సూరి చెయ్యిపట్టుకొని తమ ఇంటికి తీసుకుపోయింది వాడిని.

అక్కడికి వెళ్లగానే ఎలుగుబంటి అన్నది- "సూరీ! నాకు ఆకలివేస్తున్నది. మీ మనుషులు అన్నన్ని వంటలు చేసుకుంటారు కదా, నాకు ఏమైనా చేసిపెడతావా?" అని అడిగింది. సూరి ఇంకా భయపడుతూనే ఉన్నాడు. "సరేలే, ఇలా అయితే నువ్వు నాకు ఆహారం పెట్టలేవు గానీ, ఏదైనా మంచి హోటల్‌కి పోదాం, రా!" అని పిలిచిందది.

"ఇదేమి ఎలుగుబంటి, ఇక్కడేం హోటలు " అని భయపడుతూనే సరేనన్నాడు సూరి. అలా పోతూవుంటే దారిలో ఇటుప్రక్కన ఒక పే..ద్ద గ్రద్ద ఒకటి కనిపించింది. దాన్ని వెంటనే గుర్తుపట్టాడు సూరి. మరుక్షణం ఎలుగుబంటి చెయ్యి పట్టుకొని హోటల్‌లోకి పరుగుతీశాడు.

"ఏమయింది, ఇంత తొందరపడుతున్నావు?" అంది ఎలుగుబంటి.

"ఇందాక అక్కడ ఉందే, ఆ గ్రద్దే, మా ఊరికి వచ్చేది! అది నా తోటలో పక్షులన్నిటినీ తినేస్తోంది! దాన్ని తరుముకుంటూనే నేను ఇక్కడికి వచ్చాను!" అన్నాడు సూరి.

"ఓ అదా! అది చాలా తుంటరిది! దానిమీద ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి. రేపు కోర్టులో చెబుదాంలే, దాని సంగతి!" అన్నది ఎలుగుబంటి. తెల్లవారగానే ఇద్దరూ కోర్టుకు పోయారు.

ఎలుగుబంటి కోర్టులో చెప్పింది: "మన ప్రాంతంలో ఉండవలసిన గ్రద్ద వేరే ప్రాంతానికి పోయింది; అక్కడ ఉన్న పక్షులను తింటోది; తిరిగి ఇక్కడికి వస్తున్నది. దీనికి తమరు తగిన శిక్ష విధించాలి యువరానర్!" అని.

జడ్జిగారు అడిగారు: "ఆ గ్రద్ద ఇదేనని ఎలా గుర్తుపడతారు?”అని.

సూరి ముందుకు వచ్చి చెప్పాడు: "నిన్న కట్టెతో ఆ గ్రద్ద కంటిమీద ఒక దెబ్బ వేశాను. ఇద్దుగో, ఇప్పటికీ ఆ గుర్తు ఉంది- చూడండి! జడ్జి గారికి కోపం వచ్చింది. "ఆర్డర్ ఆర్డర్! ఈ దొంగ గ్రద్దకొక ఆరు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తున్నాం" అన్నారు.

వచ్చిన పని పూర్తి కాగానే సూరికి ఇంట్లోవాళ్లంతా గుర్తుకొచ్చారు. "నా కోసం మా వాళ్ళు ఎదురుచూస్తుంటారు. ఎలుగుబంటీ, ఇప్పుడు సముద్రం దాటి ఎలా వెళ్ళను? అడిగాడు సూరి.

"మా సీతాకోక చిలుక ఉందిగా, దానిమీద ఎక్కి పోవచ్చులే" అని ఎలుగుబంటి సీతాకోక చిలుకను రమ్మన్నది.

సూరి ఆ సీతాకోకచిలుక మీద ఎక్కి, అందరికీ నమస్కారం పెట్టి బయలు దేరాడు.

ఇంటికి రాగానే సూరి వాళ్ళ అమ్మ "ఎక్కడికి పోయినావురా, ఇన్నాళ్ళూ!" అంటూ ఏడ్చింది.

"ఏమీ లేదమ్మా! ఓ దొంగ గ్రద్ద వచ్చి మన తోటలోని పక్షులను తింటుంటేనూ, ఆ గ్రద్దని చంపేసేందుకు వెళ్ళాను" చెప్పాడు సూరి నిజాయితీగా.

"మరి ఇన్ని రోజులు పోయావేరా?" అడిగింది అమ్మ.

"అటునుండి అటు మా ఫ్రెండ్ వాళ్ల ఇంటికి పోయాను; వాడి పుట్టినరోజు కదా!" అన్నాడు సూరి.

కాలం విలువ

ఒక ఊరిలో రవి, శాంత అనే దంపతులు ఉండేవారు. రవి బాగా వ్యాపారాలు చేసి చాలా డబ్బును పోగు చేశాడు. ఈ దంపతులు ఇద్దరూ చాలా పొదుపుగా ఉండేవాళ్ళు. కానీ వీళ్ళ కొడుకు సతీష్ మాత్రం దుబారా మనిషి. స్కూలుకి వెళ్ళడమంటే వీడికి పరమ చిరాకు. రవి, శాంతి సతీష్‌ను ఒక మంచి బడిలో చేర్పించారు; కానీ సతీష్ స్కూలుకు వెళ్తున్నట్టే వెళ్ళి, ఊరి చెరువు కట్ట మీద ఆడుకునేవాడు. అంతేకాదు- వాళ్ళ నాన్న కూడబెట్టిన డబ్బును తీసుకెళ్ళి, ఏవేవో ఆటలు ఆడేవాడు; ఆ డబ్బును పోగొట్టుకునేవాడు.

ఈ విషయం వాళ్ళ నాన్నకు తెలిసి, సతీష్‌ను కొట్టాడు, తిట్టాడు. "ఇలాంటి పనులు మంచివి కావురా" అని ఎన్నో విధాలుగా చెప్పాడు. "ఇంకొకసారి ఇలా చేస్తే ఇంట్లోంచి గెంటేస్తా- జాగ్రత్త" అని బెదిరించాడు. కానీ సతీష్ ఆ మాటలు పట్టించుకోలేదు. ఒక చెవితో విని, మరొక చెవితో వదిలేశాడు.

సతీష్ స్నేహితుడు మహేష్ అని ఒకడు ఉండేవాడు. "ఇలాంటి పని ఎందుకు చేస్తున్నావురా, నేను స్కూలుకు వెళ్తున్నాను కదా, నువ్వూ నాతో రా, వెళ్దాం. బాగా చదువుకుంటే నీ కాళ్ళమీద నువ్వు నిలబడచ్చు కదా, ఇలా దొంగతనం చేయడం ఎందుకు? వాళ్ళకు నీ మీద ఉన్న ప్రేమను నువ్వే నాశనం చేసుకుంటున్నావు. ఇప్పటికైనా కాలాన్ని వృధా చేయకురా, బాగా చదువుకో" అని చెప్పాడు మహేష్. అతని మాటల్ని కూడా సతీష్ పెడచెవిన పెట్టాడు.

వాళ్ల నాన్న తిట్టినప్పుడల్లా సతీష్ ఏడ్చుకుంటూ ఎక్కడికో వెళ్లిపోయేవాడు. "వాడు ఇక మారడు" అని నిర్ధారించుకొని రవి వాడిని వదిలేశాడు. అట్లా సతీష్ దుబారాగా పెద్దవాడ య్యాడు; కానీ సోమరిపోతుగానే మిగిలిపోయాడు. పెద్దయ్యాక మహేష్ పోలీసు ఇన్‌స్పెక్టరు అయ్యాడు. ఆ ఊరి రౌడీల పట్టికలో సతీష్‌ను చూసి, చాలా బాధ పడ్డాడు.

అతన్ని పిలిచి "సతీష్, ఎలా వున్నావ్ రా! మీ అమ్మ నాన్నలు ఎలా ఉన్నారు?" అని అడిగాడు.

"నన్ను మా అమ్మా, నాన్నలు ఇంట్లోంచి తరిమేసారురా" అని చెప్పాడు సతీష్.

"మరి తమిమెయ్యక ఎలా ఉంటారు? నువ్వు అలాంటి చెడు పనులు చేస్తూంటే ఎవరైనా అలాగే చేస్తారు. అదే నువ్వు చదువుకుంటే మంచి డాక్టరో, ఇంజనీరో అయ్యేవాడివి! కానీ కాలం విలువ తెలియక అలా చేశావు. ఇప్పటికైనా మీ అమ్మా, నాన్నల దగ్గరికి వెళ్ళు. క్షమించమని వేడుకో. సోమరిపోతుగా ఉండకు. దొంగ పనులు మాని ఏదైనా వ్యాపారం చేసుకో, నేనూ నీకేమైనా సాయం చెయ్యగలనేమో చూస్తాను. అలా కాక చెడుదారినే ఉంటానంటే మటుకు, ఇన్‌స్పెక్టరుగా నా బాధ్యత నేను నిర్వర్తించాల్సి ఉంటుందని మర్చిపోకు!" అని చెప్పి వెళ్ళిపోయాడు మహేశ్. మిత్రుడి మాటలు సతీష్‌ని ఆలోచింపజేశాయి. అతని మనసు మారింది. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి క్షమాపణలు చెప్పాడు. వాళ్ళ సాయంతో తను కూడా ఒక వ్యాపారం మొదలుపెట్టాడు. నిలకడమీద అందులో విజయం సాధించాడు!

గాడిద బ్రతుకు

అనగనగా ఒక ఊరిలో ఒక అమ్మ, అవ్వ, బాబు ఉండేవారు. ఒక రోజు వాళ్ళు ముగ్గురూ ప్రక్క ఊరికి బయలుదేరారు. దారిలో వాళ్లకు ఒక గాడిద పిల్ల కనిపించింది.

బాబు అన్నాడు "అమ్మా! ఈ బుజ్జి గాడిద చూడు ఎంత అందంగా ఉందో! మనం దీనిని పెంచుకుందామా?" అని.

"సరే అట్లాగే కానివ్వురా, నీ ఇష్టం" అన్నది అమ్మ.

గాడిదను కూడా వాళ్ళు తమతోపాటు తీసుకువెళ్ళారు. దానికి ఏ పనులూ చెప్పకుండా ముచ్చటగా చూసుకునేవాళ్ళు వాళ్ళు. కొన్ని రోజులకు అది కొంచెం పెద్దది అయ్యింది.

అంతవరకూ వాళ్లమీదే ఆధారపడి బ్రతికిన ఆ గాడిదకు పెద్దవ్వగానే వేరే ఆలోచనలు మొదలయ్యాయి- అది తన మనస్సులో అనుకుంది-"ఏంటి ఇది? నేను ఒకలాగా ఉన్నాను, వీళ్ళు ఒకలాగా ఉన్నారు! అసలు నేను ఎవరిని, వీళ్ళు ఎవరు? వీళ్ళేమో ఇడ్లీలు- దోశెలు తింటారు; నాకేమో గడ్డీ, గాదం తినిపిస్తారు. సరిగ్గా తిండి కూడా‌ పెట్టరు; పైపెచ్చు నాతో పని చేయించుకుంటారేమో ఇంక!" అని అనుకుంది.

దాంతో దానికి బాధ మొదలైంది. 'తనని ఎవ్వరూ ప్రేమించటం లేదు; తన శ్రమను మాత్రం దోచుకుంటారు' అనుకున్నదది. "నేను ఈ రోజు రాత్రి ఎక్కడికైనా వెళ్ళిపోయాననుకో, మరి వాళ్ళు నన్ను వెతుకుతారా, వెతకరా?" అని సందేహించి, అది ఒక రోజున కట్లు తెంచుకొని బయట పడింది. తన తెలివితేటలన్నీ ఉపయోగించి ఒక రోజంతా ఎవ్వరికీ కనపడకుండా ఒక చోట దాక్కున్నది.

బాబు గాడిదకోసం‌ చాలా వెతికాడు; కానీ వాడికి అది కనబడితేగా? గాడిద ఏమైందో ఎవ్వరికీ తెలియలేదు.

"చూశావా, ఎవ్వరూ నాకోసం వెతకను కూడా వెతకలేదు! అంటే వీళ్ళెవ్వరికీ నామీద ప్రేమలేదన్న మాట. కేవలం పనికి మాత్రమే వాడుకుంటారన్నమాట నన్ను!" అనుకొని గాడిద వాళ్ళనుండి దూరంగా పారిపోయింది.

ఆ తర్వాత అది చాలా మంది దగ్గరికి వెళ్ళింది. దాన్ని దగ్గరికి తీసినవాళ్ళంతా దాని చేత చాకిరీనే చేయించుకున్నారు. పాపం ఎవ్వరూ దానికి ఏనాడూ ఇడ్లీలూ, దోసెలూ పెట్టనే లేదు!

సమయస్ఫూర్తి ‍‍‍ కథ‌

ఇతరులకు సాయపడే మనస్తత్వం ఉన్న రామానందుడు ఆ గ్రామంలో ఉన్న గుడ్డివాడైన సోముడికి సాయపడాలనుకున్నాడు. సోముడు అంగవైకల్యం అధిగమించి జీవితంలో స్థిరపడాలంటే ఏదైనా విద్య నేర్పించడం అవసరమని గ్రహించి, తన సంపాదనలో కొంత ఖర్చు చేసి ఒక సంగీత విద్వాంసుడి దగ్గర చేర్పించాడు.

భగవంతుడు దయామయుడు. సోముడికి కళ్లు ఇవ్వకపోయినా గొంతులో మాధుర్యాన్ని ఇచ్చాడు. నిరంతర సాధనతో కొద్ది కాలంలోనే గురువు మన్ననలను పొందాడు.

సోముడు రామానందుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ‘‘మొదట నువ్వు సాయపడతానంటే ఎంతో కొంత డబ్బు ఇచ్చి తాత్కాలిక సాయం చేస్తావనుకున్నాను. ఇలా శాశ్వత సంపద అందచేస్తావనుకోలేదు. నీలా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే బాగుంటుంది. అంగవైకల్యం ఉన్నవారికి తాత్కాలిక సాయంగాని, సానుభూతి గాని పెద్దగా ఉపయోగపడదు. ఆత్మస్థయిర్యం పెంచే నీ సాయం కొండంత అండ’’ రామానందుడ్ని ఆలింగనం చేసుకున్నాడు సోముడు.

‘‘నా మనస్సుకు పుట్టిన బుద్ధితో నాకు చేతనైనంత సాయం చేసాను. ఇందులో కృతజ్ఞతలు చెప్పుకోవాల్సినంత గొప్పతనం లేదు. ఇచ్చి పుచ్చుకోవడమే మానవ జీవితం. రేపటి రోజు ఈ సంగీతాన్ని నలుగురికి నేర్పి ప్రతిభావంతుల్ని వెలికి తీస్తావు. ఈ రోజు నేను అందజేసినది రేపు నువ్వు నలుగురికి పంచుతావు ఇది నిజం కదా!’’ అంటూ తల నిమిరాడు రామానందుడు.

రామానందుడి ఆప్యాయతకు సోముడి కళ్లు చెమర్చాయి. ‘‘అన్నా! నువ్వు చెప్పినట్టే ఈ శాశ్వత సంపదను నలుగురికీ పంచుతాను’’ అన్నాడు సోముడు.

‘‘ఈ రాజ్యంలో రాజుగారు కళాప్రియులు. అతని దగ్గర నీ ప్రతిభ చూపించి సంగీత కళాశాలకు అవసరమైన నిధులు సమకూర్చుకుందాం’’ అంటూ అభయమిచ్చాడు రామానందుడు.

కొద్దిరోజులు సోముడితో సావాసం రామానందుడికి కూడా సంగీత ప్రవేశం కలిగింది. సోముడిలో ఒంటరితనం పోగొట్టేందుకు రామానందుడు తనకు తీరిక దొరికినపుడల్లా వచ్చి సోముడితో సంగీత సాధన చేస్తుండేవాడు. చివరకు రామానందుడు కూడా సంగీతంలో ప్రావీణ్యత సంపాదించాడు.

ఒకరోజు రామానందుడు సోముడ్ని వెంటపెట్టుకుని సంగీత ప్రదర్శన ఇచ్చేందుకు రాజుగారి కోటకు చేరుకున్నారు. ప్రవేశ ద్వారం వద్దే అడ్డంకులు ఎదురయ్యాయి. రాజదర్శనం అంత తేలిక కాదన్నారు కాపలాదారులు.

కాపలా భటులు లంచం ఆశిస్తున్నట్టు గ్రహించిన రామానందుడు రాజుగారు ఇచ్చే కానుకల్లో సగం ముట్టచెబుతామని ఒప్పందం కుదుర్చుకున్నాడు.

రాజాస్థానంలో ప్రవేశం కలిగింది. రాజుగారి అనుమతితో సంగీత ప్రతిభను ప్రదర్శించారు. చూసిన వారంతా చప్పట్లతో జేజేలు పలికారు.
రాజు సంతృప్తి చెంది చెరో వంద బంగారు నాణేలు ఇద్దరికి బహూకరించాడు.

రామానందుడు తన వాటాలో యాభై నాణేలను లెక్కించి రాజుగారికి తిరిగి ఇవ్వబోయాడు.

రామానందుని చర్య రాజుగారిని అవమానించేట్టు ఉండడంతో రాజుగారికి కోపం వచ్చింది. పక్కనే వున్న మంత్రి కలగజేసుకుని ‘నువ్వు చేస్తున్న పని ఏమిటి?’ అని నిలదీసాడు.

‘‘క్షమించండి! నిజం చెప్పమంటారా? అబద్ధం చెప్పమంటారా?’’ ధైర్యంగా అడిగాడు రామానందుడు
రాజుగారికి కోపం చల్లారింది. రామానందుడి చేతల్లో ఏదో ఆంతర్యం ఉందని గ్రహించి ‘‘ముందు అబద్ధం చెప్పు. అది మాకు సబబుగా అనిపించకపోతే మీ తల కోట గుమ్మానికి వేలాడుతుంది’’ హెచ్చరికగా చెప్పాడు.

‘‘అబద్ధం వినండి! మేమిద్దరం గుడ్డివాళ్లమనే సానుభూతితో చెరో వంద బంగారు నాణేలు కానుకగా ఇచ్చారు. నాకు ఒక కన్ను కనిపిస్తోంది. నా మిత్రుడికి రెండు కళ్లూ కనిపించవు. అతనికి వంద నాణేలు ఇచ్చినప్పుడు న్యాయంగా యాభై నాణేలు మాత్రమే నేను తీసుకోవాలిగా అందుకే తిరిగి యాభై నాణేలు మీకు అందించింది’’ అన్నాడు రామానందుడు.
రాజు సంతృప్తి చెందాడు. ‘అయితే ఈ సారి నిజం చెప్పు‘ అన్నాడు రాజు.

‘‘మీరు నటనా సార్వభౌములు. గొప్పగా నటించగలరు. అందులో ఇప్పుడు నటిస్తున్న గుడ్డివాడి పాత్ర అమోఘంగా ఉంది. తోటి కళాకారుడ్ని ప్రోత్సహించడం కళాకారుడిగా నా ధర్మం. అందుకే యాభై నాణేలు ప్రోత్సాహ బహుమతిగా ఇవ్వచూపింది’’ అన్నాడు రామానందుడు.

ఒక్కసారిగా రాజుగారి ముఖ కవళికలు మారిపోయాయి. ‘‘నేను గుడ్డివాడిగా నటిస్తున్నానా! రుజువేంటి?’’ కోపంతో అడిగాడు.
అప్పుడు కాపలా భటుల లంచాల గురించి తెలియజేస్తూ కోటలో జరుగుతున్న అవినీతి చర్యలను చూడలేని మిమ్మల్ని గుడ్డివాడిగా అంచనా వేయడంలో తప్పులేదుగా అదే రుజువు!’’ అన్నాడు రామానందుడు.

నిప్పులాంటి నిజం చెప్పిన రామానందుడి మాటల్లో యదార్థాన్ని మంత్రి ద్వారా ఆరా తీయించాడు రాజు. నిజమని తేలింది. భటులకు శిక్ష విధించాడు.

కోటలో జరుగుతున్న అవినీతి బండారాన్ని సమయస్ఫూర్తితో తెలియజేసిన రామానందుడిని మెచ్చుకుని మరిన్ని కానుకలతో సత్కరించాడు ఇద్దరిని ఆ రాజుగారు.

ఆకానుకలతోసంగీతకళాశాలస్థాపనకుపూనుకున్నాడురామానందుడు.

దోచుకునేవాడికి దొరికినంత

అనగనగా ధర్మపురి రాజ్యం. ఆ రాజ్యానికి రాజు సత్యవంతుడు. ఆ రాజు వద్ద చిత్రాంగుడు అనే సేవకుడు పనిచేసేవాడు. రాజు దర్శనం కోసం ప్రతిరోజు దర్భారుకు వచ్చే ప్రజలను లోనికి అనుమతించడానికి పదో, పాతికో పుచ్చుకోవడం అతని అలవాటు. ప్రజల సమస్యలను సాను కూలంగా విని ధర్మానికి లోపడి పరిష్కారించే రాజు కు సేవకుడి తీరు వేగుల ద్వారా తెలిసింది. అక్రమంగా సేవకుడు ప్రజలను దోచుకోవడం రాజుకు నచ్చలేదు. వెంటనే ఆ సేవకుణ్ణి రాజ మందిరం నుంచి తొలగించి భక్తులను వరుసగా పంపించేలా దేవాలయం ముందు నియ మించాడు.

కనీసం దైవభక్తి, పాపభీతి తో నైనా డబ్బులు తీసుకోవడం మానివేస్తాడని రాజు ఆలోచించాడు. రెండురోజులు నమ్మకంగా పనిచేసి గుడికి వచ్చిపోయేవారిని గమనించిన ఆ సేవకుడు మూడోరోజునుంచి ప్రత్యేకదర్శనం అంటూ భక్తులతో కూడా డబ్బులు తీసుకోవడం ప్రారంభించాడు. వేగుల ద్వారా విషయం తెలుసుకున్న రాజు చిత్రాంగుడిలో మార్పురాకపోవడంతో ఆశ్చర్యపోయాడు.

ఉద్యోగం నుంచి తొలగిస్తే అతని కుటుంబం వీధిన పడుతుందని భావించాడు. ఏలాగైన అతనిలో మార్పు తీసుకురావాలన్న ప్రయత్నంతో శ్మశానం వద్ద కాపలాదారుడిగా నియమించాడు. రాజ మందిరంలో దర్జాగా, దేవాలయం లో నిత్యం దేవుడిని చూస్తూ ఉండాల్సిన తాను శ్మశానం ముందు కాపలా దారుడిగా పనిచేస్తున్నందుకు సేవకుడు పశ్చాత్తాప పడతాడని రాజు భావించారు.

కాని సేవకుడిలో మార్పులేదు. రెండు, మూడు రోజులు పరిస్థితులు గమనించాడు చిత్రాంగుడు. ఆ తరువాత కర్మకాండలకు వచ్చే వారి నుంచి డబ్బులు వసూలుచేయడం ప్రారంభించాడు. ఇది గమనించిన రాజు ఇక లాభం లేదనుకున్నాడు. చిత్రాంగుడినే పిలిచి కారణం తెలుసుకుని కఠినంగా శిక్షించాలని నిర్ణయించాడు. అతడిని రాజదర్భారుకు పిలిపించి, నిండు సభలో 'ఉచితంగా చేయాల్సిన పనుల కోసం ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడం తప్పుకదా. ఎందుకు చేశావు' అని ప్రశ్నించాడు.

శాంతంగా ఉండే మహారాజు ఉగ్రరూపం చూసి సభలోని వారందరూ భయంతో వణికిపోయారు. చిత్రాంగుడికి మరణశిక్ష తప్పదని భావించారు. కాని చిత్రాంగుడు మాత్రం బెదరలేదు. ఎంతో శాంతంగా 'మహారాజా!, నేను చేసింది తప్పే. కాని రోజు అనేకమందిని డబ్బులు అడిగాను. కొందరు ఎమి అనకుండా ఇచ్చారు, మరికొందరు తిట్టుకుంటూ ఇచ్చారు. కాని ఎవ్వరు కూడా ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నించలేదు. మీకు వచ్చి ఫిర్యాదు చేయలేదు. మీరు రోజు అందరినీ కలిసి వారి సమస్యలు వింటారని తెలుసు. కాని ముందుగా తామే మీ మందిరానికి రావాలన్న ఆరాటంతో నేను అడిగిన వెంటనే డబ్బులు ఇచ్చేవారు.

ఇక దేవాలయంలో దేవుడు అందరినీ ఒకేలా చూస్తాడు. కాని ఎక్కువ తప్పులు చేసిన వాడికి ప్రత్యేకపూజలు అనగానే తాము చేసిన పాపాలు పోతాయని నమ్మకం. అందుకే డబ్బులు ఇచ్చేవారు. ఇక శ్మశానంలో కూడా కర్మకాండలు త్వరగా ముగించాలని ఆరాటమే తప్ప పోయిన మనిషిపై మమకారం లేదు. అందుకే డబ్బులు ఇచ్చారు.

తూతూ మంత్రంగా కర్మ కాండ చేసి వెళ్లిపోయారు. డబ్బులు ఇచ్చే ప్రజలకు లేని పట్టింపు తీసుకునే నాకు ఎందుకు రాజా'' అని ఎదురు ప్రశ్నవేసాడు. చిత్రాంగుడి తీరుకు సభలోని వారు ఆశ్చర్యపోయారు. రాజు నోట మాటలేదు. తప్పు సేవకుడిది కాదు అతనిని అవినీతి దిశగా ప్రేరేపించిన ప్రజలదే అన్న వాస్తవం తెలుసుకున్నాడు. లంచం తీసుకునే వాడికన్నా ఇచ్చేవాడికే ఎక్కువ శిక్ష ఉంటుందని సభలో ప్రకటిం చాడు.

అంతే ఆ రోజు నుంచి చిత్రాంగుడితో పాటు అనేక మందిలో మార్పు వచ్చింది. ధర్మపురి రాజ్యం ఎందరికో ఆదర్శం అయ్యింది. పిల్లలూ! ఇప్పుడు చెప్పండి! ఈ కథ ద్వారా మీకు ఏం అర్థం అయ్యిందో! ఇచ్చేవాడు ఉంటే తీసుకునేవాళ్లకి లోటు లేదు. అందుకే ప్రశ్నించడం నేర్చుకోండి

నడ్డి విరిగిన నక్క

అనగనగా ఒక అడవిలో ఒక టక్కరినక్క ఉండేది. ఒకరోజు అది ఆహారం కోసం బయలుదేరింది. దారిలో దానికి ఒక పులి ఎదురొచ్చింది. ఆ పులి కూడా చాలా ఆకలితో ఉండి ఆహారం కోసం వెతుకుతోంది. నక్కను చూడగానే పులి దాని వెంటపడింది.
‘బాబోయ్! నా ఆకలి సంగతి సరే.

ఈ పులికి దొరికితే నేను దానికి ఆహారమైపోతాను’ అని భయంగా అనుకుంటూ నక్క పరుగు తీసింది. పులి దాన్ని వెంబడించింది. నక్క పరిగెడుతూ పరిగెడుతూ ఒక చెట్టు పైకి ఎక్కేసింది. ఆ చెట్టు కొమ్మ మీద ఒక ఎలుగుబంటి నిద్రపోతోంది. నక్క రాకతో దానికి నిద్రాభంగమై కళ్ళుతెరిచి చూసింది.

‘‘ఎలుగుబంటి మామా! ఈ చెట్టు కింద ఒక పులి నాకోసం కాచుకుని కూర్చుంది. కొద్దిసేపు ఆశ్రయం ఇచ్చి నా ప్రాణాలు కాపాడు’’ అని ప్రాధేయపడింది.

‘సరే’నంటూ ఎలుగుబంటి తిరిగి నిద్రలోకి జారుకుంది. నక్క ఎప్పుడైనా కిందకు దిగకపోతుందా, దాన్ని తినకపోతానా అని పులి చెట్టు కిందే కాపు కాసింది. ఎంతకీ పులి కదలకపోవడంతో దాని బారినుండి తప్పించుకునే మార్గం కోసం ఆలోచించసాగింది. చివరకి దానికో ఉపాయం తట్టి ఎలుగుబంటి వైపు చూసింది. ఎలుగుబంటి గాఢనిద్రలో ఉంది. ‘దీన్ని కిందకు తోసేస్తే? అప్పుడు పులి దాన్ని తింటుంది కాబట్టి నన్ను వదిలిపెడుతుంది. అది తినగా మిగిలిన మాంసాన్ని నేను తినొచ్చు. ఈ విధంగా నా ప్రాణాలను నేను రక్షించుకోవడమే కాకుండా నా కడుపు కూడా నిండుతుంది’ అని ఆలోచించి నక్క ఎలుగుబంటిని కిందకు తోసేసింది.

అయితే ఎలుగుబంటి పడటం పడటం సరిగ్గా పులి మీద పడింది. ఎలుగుబంటి బరువుకు పులి నడ్డి విరిగింది. జరిగిందేమిటో ఎలుగుబంటికి అర్థమైంది. అంతే ఒక్కక్షణం కూడా ఆలస్యం చేయకుండా చెట్టెక్కి నక్క గూబ మీద ఒక్కటిచ్చింది. గూబ గుయ్యిమన్న నక్క పట్టు తప్పి కింద పడింది. దానితో దాని నడ్డి కూడా విరిగింది.
నీతి:దుష్టులకుఆశ్రయంఇవ్వకూడదు.

తెలివైన నక్క

అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. దానికి ఒకరోజు బాగా ఆకలి వేసింది. ఆహారం కోసం అడవంతా వెతకసాగింది. ఒకచోట దానికి చచ్చిపడున్న ఒక జింక కనిపించింది. ‘ఆహా! ఇవాళ నా అదృష్టం బావుంది. రెండు రోజులపాటు ఈ జింక మాంసం తిని కడుపు నింపుకోవచ్చు’ అనుకునేంతలో ఒక సింహం గట్టిగా గర్జించింది. ఆ శబ్దం వినపడగానే నక్క చెట్టు వెనుక నక్కింది.

‘అయ్యో! ఈ సింహం ఇప్పుడొచ్చిందేమిటి? అసలే దీని కడుపు పెద్దది. కొంచెం కూడా మిగల్చకుండా తినేస్తుంది,’ అనుకుంది నక్క నిరాశగా.

సింహం జింక మాంసం తినబోయింది. ఇంతలో ఒక ఎలుగుబంటి అక్కడకు దూసుకు వచ్చింది. ‘‘ఏయ్! దాన్ని ముట్టుకోకు. అది నాది. నేనే ఆ జింకను వేటాడి చంపాను,’’ అంటూ గట్టిగా అరిచింది.

‘‘నువ్వు చంపడమేమిటి? అబద్ధాలు చెప్పకు. అయినా ఈ అడవికి నేను రాజును. కాబట్టి ఏ పదార్థాన్నైనా ముందుగా తీసుకునే అధికారం నాకే ఉంది. నువ్వు మర్యాదగా పక్కకు తప్పుకో,’’ అంటూ కోపంగా గర్జించింది సింహం.
ఎలుగుబంటి తక్కువేం తినలేదు. ‘‘నువ్వు రాజయితే నాకేంటి? కాకపోతే నాకేంటి? న్యాయం న్యాయమే! ఈ మాంసం నాది, అంతే’’ అంది కోపంగా.

ఇంకేం, నాదంటే నాదని రెండూ కాసేపు వాదించుకున్నాయి. తరువాత ముష్టియుద్ధానికి దిగాయి. సింహం తన పంజాతో ఎలుగుబంటి మూతి మీద కొడితే, ఎలుగుబంటి సింహాన్ని కిందపడేసి దాని నడుము మీద పిడికిలితో ఒక్కటిచ్చింది. చెట్టుచాటున దాగున్న నక్క ఇదంతా గమనిస్తోంది. సింహం ఎలుగుబంటి రెండూ భీకరంగా పోట్లాడుకోసాగాయి. అరగంట... గంట గడిచింది. చివరకు రెండూ కొట్టుకుని కొట్టుకుని సృ్పహ తప్పి పడిపోయాయి.

నక్క నెమ్మదిగా చెట్టుచాటు నుంచి ఇవతలకు వచ్చింది. సింహం, ఎలుగుబంట్ల వైపు చూసింది. ఆ రెండూ చలనం లేనట్టు పడున్నాయి. నక్క ఏమాత్రం చప్పుడు చేయకుండా ఎంతో జాగ్రత్తగా జింక మాంసాన్ని కడుపునిండా తింది. మిగిలిన దానిని పొదలమాటుకు ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది.

తిక్కకుదిరింది

అనగనగా ఒక అడవిలో ఒక కుక్క ఉండేది. అది పరమ పిసినారి. ఒకసారి దానికి ఒక మాంసం ముక్క దొరికింది. దానిని ఏ వీధి అరుగుమీదో, ఏ చెత్తకుండీచాటునో కూర్చుని తినచ్చు కదా! ఊహూ... తోటి కుక్కలు చూస్తే తమకూ కాస్త పెట్టమంటాయని దాని భయం. ఎందుకంటే అది ఎప్పుడూ మిగతా కుక్కల దగ్గర ఆహారం అడిగి తినేది. అందుకే ఆ మాంసం ముక్కను తీసుకుని చాటుగా ఊరవతలికి బయలుదేరింది.

ఊరవతల ఒక చెట్టు మీద ఉన్న రెండు కాకులు కుక్క నోట్లో ఉన్న మాంసం ముక్కను చూశాయి. దొరికిన ఆహారాన్ని కలిసి పంచుకుని తినే కాకులు కుక్క దగ్గర్నుంచి ఎలాగైనా సరే మాంసం ముక్కను కొట్టేయాలి అనుకున్నాయి. అందుకని అవి కుక్క ముందు వాలి స్నేహంగా కబుర్లు చెప్పడం మొదలు పెట్టాయి.

‘‘కుక్క మామా! కుక్క మామా! బాగున్నావా? ఊరిలో నుంచి వస్తున్నావు, ఏమిటి సంగతులు?’’ అని ఒక కాకి అడిగింది. కుక్క ఏమీ లేవన్నట్టు తల అడ్డంగా ఊపింది.

‘‘నువ్వు మేలుజాతి కుక్కలా ఉన్నావు. నీలాంటి కుక్కను ఇంతకు ముందు మేమెన్నడూ చూడలేదు. నీతో స్నేహం చేయాలని ఉంది. చేస్తావా?’’ అంటూ పొగిడాయి. కాకుల పొగడ్తలకు పొంగిపోయిన కుక్క ‘సరే’ అని తలూపింది.

వెంటనే రెండు కాకులూ సంతోషంగా అరుస్తూ కుక్క చుట్టూ తిరుగుతూ ఆడుకోసాగాయి. ఒక కాకి కుక్క వెనుకకు, మరొక కాకి కుక్క ముందుకు చేరాయి. వెనుకనున్న కాకి హఠాత్తుగా కుక్క తోక పట్టి లాగింది. ఉలిక్కిపడిన కుక్క మాంసపు ముక్కను నేల మీద పెట్టి వెనక్కి తిరిగి చూసింది. ఇంతలో ముందు వైపు ఉన్న కాకి ఆ మాంసపు ముక్కను నోటితో కరుచుకుని రివ్వున ఎగిరి వెళ్ళిపోయింది. పనైపోయిందిగా, ఇక రెండో కాకి కూడా అక్కడి నుండి వెళ్ళిపోయింది. రెండూ చెట్టు మీద కూర్చుని మాంసం ముక్కను పంచుకుని తిన్నాయి. పాపం ఆ కుక్క నోటమాటరాక అలా చూస్తూ ఉండిపోయింది.

నక్కమామ- కుందేలు

అనగనగా ఒక అరణ్యంలో ఒక కుందేలు ఉండేది. దానికి ఏ మాత్రం తెలివితేటలు లేవు. దానికి ఒక్కసారి కూడా ఎటువంటి ప్రవూదం ఎదురు కాలేదు. అందువల్ల దానికి భయువుంటే ఏమిటో కూడా తెలీదు. ఒకరోజు బాగా ఎండగా ఉంది. కుందేలుకు విపరీతమైన దాహం వేసింది. దాహం తీర్చుకోవడానికి కాలువ దగ్గరకు బయులుదేరింది. దారిలో ఒక నక్క ఎదురరుుంది. కుందేలును చూడగానే నక్క నోట్లో నీళ్లూరారుు. అరుుతే అది కుంటినక్క. ఒక కాలు సరిగ్గా లేకపోవడంతో కుందేలును వేటాడడం దానికి సాధ్యం కాదు. అందుకని ఒక ఉపాయం పన్నింది.

కుందేలును చూస్తూ, ‘‘ఏంటి అల్లుడూ! ఇంత ఎండలో ఎక్కడికి వెళుతున్నావు? రా! ఇలా వచ్చి నీడలో కాసేపు విశ్రాంతి తీసుకో’’ అంటూ పిలిచింది నక్క.

‘‘నాకు దాహంగా ఉంది వూవూ! వుుందు నీళ్లు తాగి వస్తాను’’ అని ఎంతో వుర్యాదగా చెప్పి అక్కడి నుంచి కదిలింది కుందేలు.

కుందేలు నీటి కాలువ దగ్గరకు వెళ్లి చల్లటినీళ్లను కడుపునిండా తాగింది. దాహం తీరాక తిరిగి అది నక్క దగ్గరకు వచ్చింది.

కుందేలును చూసి నక్క ఆశ్చర్యపోరుుంది. ‘ఇది పిచ్చిదానిలా ఉంది. దీన్ని నమ్మించి మోసం చేయూలి?’ అనుకుంది.

‘‘నక్క వూవూ! నిన్ను కలుసుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. నువ్వంటే వూ వాళ్లకు చాలా భయుం తెలుసా? నిన్ను టక్కరినక్క అంటూ తిడుతుంటారు’’ అంది.

‘‘నిజమే అల్లుడూ! నేనెంతో వుంచిదాన్ని. కాని ఎవరూ నన్ను మెచ్చుకోరు’’ అంది ఎంతో దిగులు నటిస్తూ.

‘‘బాధపడకు. దీనికి పరిష్కారం కనుక్కుందాం. నువ్వు వుంచిదానివని అందరికి తెలిసేలా చేద్దాం?’’

‘‘అరుుతే ఈ రోజు రాత్రి నా ఇంటికి వస్తావా? భోజనం చేస్తూ వూట్లాడుకుందాం?’’ అంది నక్క.

‘‘తప్పకుండా వస్తాను!’’ అంది కుందేలు.

నక్క తనలో తాను క్రూరంగా నవ్వుకుంది. ‘‘అహ్హహ్హా... ఈ పిచ్చి కుందేలు నా వలలో చిక్కుకుంది. ఈ రాత్రికి కుందేలు ఇగురు వండుకుని తింటాను’’ అనుకుంది.

చీకటి పడగానే నక్క గుహకు బయులుదేరింది కుందేలు. నక్క ఎంతో ఆత్రంగా కుందేలు కోసం ఎదురుచూస్తూ ఉంది.

‘‘రా అల్లుడూ! నీ కోసమే చూస్తున్నాను’’ అంటూ ప్రేవుగా పిలిచింది నక్క.

అరుుతే అక్కడ తినడానికి ఆహారం ఏమీ కనిపించలేదు. ఆహారం కోసం కుందేలు వెతకసాగింది. నక్క తొందరపడి, భీకరంగా అరుస్తూ ఒక్కసారిగా కుందేలు పైకి దూకబోయింది. అదృష్టం.... కుందేలు ఇంకా పూర్తిగా లోపలికి రాలేదు. గుహ ద్వారానికి దగ్గరలోనే నిలబడి ఉంది. ప్రవూదం పసిగట్టిన కుందేలు నక్కకంటే వేగంగా వెనకకు దూకింది. కుందేలు మీద పడాల్సిన కుంటి నక్క దబ్బున నేలమీద పడింది.

‘బాబోయ్ నక్కలు నిజంగానే కుందేళ్లను తింటారుు’ అనుకుంటూ భయుంగా పారిపోరుుంది కుందేలు.

ఆరోజు నుంచి కుందేలు నక్కలకు, కుక్కలకు దొరక్కుండా దూరంగా మసలుతూ ఎంతో జాగ్రత్తగా ఉండసాగింది.

వింతగొర్రె

ఒక రోజు ఒక వ్యాపారస్తుడు కొన్ని గొర్రెలతో అడవి దాటుతుండగా అందులో ఒక గొర్రె దారితప్పి ఆ దట్టమైన అడవిలోనే ఉండిపోయింది. అక్కడ క్రూరమృగాలు ఉంటాయి, వాటి బారిన పడి చస్తానేమోనని గొర్రె చాలా భయపడింది. అందుకే దేనికంటా పడకుండా జాగ్రత్తగా ఉంటూ నెమ్మదిగా అటూ ఇటూ తిరగసాగింది. ఒకరోజు గొర్రెకు ఒక సింహం తోలు కనబడింది. వెంటనే దానికి ఒక ఆలోచన వచ్చింది. ‘ఏ క్రూరమృగం ఎప్పుడు దాడి చేస్తుందోనని చస్తూ బతుకుతున్నాను. ఈ తోలును కప్పుకుంటే నేను కూడా సింహంలా కనబడతాను. అప్పుడు నా జోలికి ఎవరు రారు’ అని అనుకుంది.

వెంటనే గొర్రె ఆ తోలును తీసుకుని కప్పుకుంది. ఇప్పుడది వింత జంతువులా కనబడసాగింది. గొర్రె ఆ కారం చూసి కుందేళ్ళు, జింకలు, ఎలుగుబంటులు, నక్కలు భయంతో పరుగులు పెట్టాయి. చివరకు పులులు, సింహాలు కూడా గతుక్కుమన్నాయి. అది చూసి గొర్రెకు చాలా సంతోషం కలిగింది. వాటిని ఇంకా భయపెట్టడానికి గొంతు కాస్త మార్చి విచిత్ర శబ్దాలు చేయడం, కాలు నేలకు రాస్తూ జంతువుల మీదకు దాడి చేస్తున్నట్టు నటించడం చేయసాగింది. దానితో ఆ అడవి జంతువులన్నీ బిక్కచచ్చిపోయాయి. వాటి కంటి మీద కునుకు లేకుండా పోయింది. గొర్రె కడుపునిండా గడ్డిమేస్తూ యధేచ్ఛగా తిరగసాగింది.

ఒకరోజు గొర్రె ఒక కాలువ ఒడ్డుకు షికారు వెళ్ళింది. అక్కడి ప్రదేశమంతా పచ్చటి గడ్డితో ఎంతో అందంగా ఉంది. ఆ లేత గడ్డిని చూసి గొర్రె ఎంతో హుషారుగా వాటిని మేయడం మొదలుపెట్టింది. సరిగ్గా అప్పుడే ఒక సింహం దాహం తీర్చుకోడానికి వచ్చి గొర్రెను చూసింది. ‘ఇదేమి విచిత్రం, సింహం జాతికి చెందిన జంతువు గడ్డిమేయడమా? సింహం ఆకలితో చస్తుంది. కానీ గడ్డి మాత్రం మేయదు. బహుశా ఇది క్రూర జంతువు కాకపోవచ్చు’ అని ఆలోచించి ఒక్కసారిగా గర్జించింది.

ఆ అరుపువిని గొర్రె భయపడిపోయింది. తన ప్రాణాలను రక్షించుకోవడానికి పరుగుపెట్టింది. ఇంతలో గొర్రె కప్పుకుని ఉన్న సింహం తోలు దాని ఒంటి మీద నుండి జారిపోయింది. ఎదురుగా ప్రత్యక్షమైన గొర్రెను చూసి సింహం నోరు వెళ్ళబెట్టింది. గొర్రె ఎలాగోలా సింహానికి దొరక్కుండా అక్కడి నుండి పారిపోయింది. ఎదో విధంగా అడవిని దాటి తనకు కనబడి న ఊళ్లోకి వెళ్లిపోయింది. ఆ సంగతి తెలిసి జంతువులన్నీ నవ్వుకున్నాయి. ఇక ఆ తరువాత అడవిలో నిర్భయంగా సంచరించసాగాయి.

పశ్చాత్తాపం

ఒక అడవిలో కాకి, పిచ్చుక ఎంతో స్నేహంగా ఉంటుండేవి. అవి ఒకదానిని మరొకటి ఆపద సమయంలో ఆదుకోవడమే కాక ఒకదాని పిల్లల్ని మరొకటి ఎంతో ప్రేమగా చూసుకుంటుండేవి.

ఒకరోజు కాకి, పిచ్చుక పిచ్చా పాటిగా మాట్లాడుకొంటుండగా

‘‘రక్షించండి! రక్షించండి! నేస్తాల్లారా! ’’ అంటూ భయంతో వణికిపోతున్న నెమలి ఒకటి వాటి దగ్గరికి పరిగెత్తుకొచ్చింది.

‘‘ఏమిటి నేస్తమా? ఎక్కడినుండి పరిగెత్తుకొస్తున్నావు? ఎందుకిలా కంగారుపడుతున్నావు? అని అడిగింది కాకి.

‘‘ మా కుటుంబంలోంచి పొరపాటున తప్పిపోయి వేటగాని కంటపడ్డాను. అతను నా వెంట పడుతుంటే తప్పించుకునే యత్నంలో పూర్తిగా దారితప్పి పరిగెత్తుకొస్తుంటే మీ ఇద్దరూ కనపడ్డారు. మీరే నన్ను ఆదరించి రక్షించాలి’’ అని వేడుకుంది నెమలి.

‘‘సరే! అలాగే నేస్తమా’’ అని ఆదరించాయి కాకి, పిచ్చుక.

తిరిగి వెళ్లడానికి దారి తెలియకపోవడంవల్ల కాకి, పిచ్చుకలతోపాటు అక్కడే వుండి వాటికి మంచి నేస్తమైంది నెమలి.

కొన్నాళ్లు బాగానే గడిచిపోయిది వాటి స్నేహం. కాకి, పిచ్చుకకు మధ్య ఉన్న అత్యంత స్నేహాన్ని జీర్ణించుకోలేకపోయిన నెమలికి క్రమంగా వాటిపై అసూయ మొదలైంది. ఎలాగైనా కాకి, పిచ్చుకను విడదీయాలనే దురాలోచన మొదలైంది నెమలికి.

ఒకరోజు కాకి ఆహారం కోసం బయటకు వెళ్లిన సమయంలో పిచ్చుకతో

‘‘మిత్రమా, నీవు కాకితో ఎందుకు అంత స్నేహాన్ని పెంచుకుని అత్యంత చనువుగా ఉంటున్నావు? ఎందుకలా దాన్ని గౌరవిస్తావు? అది ఎంత అందవిహీనమైందో ఒక్కసారైనా ఆలోచించావా? చనిపోయిన కుళ్లిపోయిన జంతు మాంసాన్ని తింటుంది. దాన్ని చూసి అందరూ చీదరించుకుంటారు. అది ఎవరి తలనైనా తాకితే అపశకునమని అంటారు. అంతేకాక చనిపోయిన వారికి పెట్టిన పిండాల్ని తెచ్చి మీ పిల్లలకు ఆహారంగా పెట్టడం నేను చాలాసార్లు చూసాను. నేను చెప్పవలసింది చెప్పాను. తరువాత నీ ఇష్టం’’ అంది నెమలి.

ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పిచ్చుక

‘‘నిజమే నేస్తమా! నేను ఇన్నాళ్లనుండి కాకి గురించి ఆలోచించడానికి ప్రయత్నం చేయలేదు. దాని మొహం దాంతో స్నేహం చేయడమేంటి? నీలాంటి అందగత్తెతో స్నేహం చేస్తే నా విలువ, హోదా పెరుగుతుంది’’ అంది నెమలితో.

తన పథకం పారినందుకు ఎంతో సంబరపడిపోయింది నెమలి. నెమలి, పిచ్చుక ప్రవర్తనలలో తేడాను గమనించసాగింది కాకి. తనను వాటినుండి దూరం చేయాలనే దురాలోచనలో ఉన్నాయని గ్రహించింది కాకి.

ఒకరోజు

మిత్రులారా! నావల్ల, నా పిల్లల వల్ల మీకు ఇబ్బంది కలుగుతోంది కాబోలు. అందువల్ల ఇక్కడకు సమీపంలో ఒక గూడు ఏర్పాటు చేసుకున్నాను. నా పిల్లలతో సహా అక్కడికి వెళ్లిపోతాను. సెలవివ్వండి‘‘అని బాధతో అంది కాకి.

దానంతట అది వెళ్లిపోతున్నందుకు లోలోన ఎంతో సంతోషపడుతూ ‘‘సరే నీ ఇష్టం నేస్తమా!’’ అని అన్నాయి నెమలి, పిచ్చుకలు.

కాకిపీడ విరగడైనందుకు విందు చేసుకున్నారు పిచ్చుక, నెమలి.

ఇలా కొంతకాలం గడిచిపోయింది.

పాత మిత్రులను వదిలి వచ్చి చాలా రోజులైంది. ఒకసారి వాళ్లను చూడాలనే కోరిక కలిగింది కాకికి. నెమలి, పిచ్చుక నివశిస్తున్న వైపుకి వేగంగా వెడుతున్న కాకికి ఒక వేటగాడు పురివిప్పి నాట్యం చేస్తున్న నెమలిపై బాణాన్ని ఎక్కుపెట్టడం గమనించింది కాకి. కంగారు పడ్డ కాకి, నెమలిని రక్షించే ఉపాయం కోసం ఆలోచిస్తుండగా అక్కడ చనిపోయిన పాము ఒకటి కనపడింది కాకికి. దాన్నిచ టుక్కున నోట కరుచుకుని వేటగాడిమీద పడేట్టు జారవిడిచి

‘‘తప్పుకో నెమలి మిత్రమా! ఆపద ఆపద అని పెద్దగా అరిచింది కాకి.

నెమలి తలతిప్పి చూసేసరికి

‘‘అమ్మ బాబోయ్! పాము’’ అంటూ పెద్దగా అరుస్తూ భయంతో పరిగెడుతున్న వేటగాడు నెమలి కంటపడ్డాడు.

జరిగిన విషయాన్ని గమనించిన నెమలికి గుండె ఝల్లుమంది. పరిగెత్తుకుంటూ వచ్చి కాకి కాళ్లపై పడి.

‘‘క్షమించు మిత్రమా! అందగత్తెననే అహంకారంతో నాకు ఆశ్రయమిచ్చి ఆదుకున్న నీకు మిత్రద్రోహం చేశాను. అన్యోన్య స్నేహితులైన మీ ఇద్దరినీ అసూయతో వేరు చేశాను. కానీ నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు. నీ రుణం ఎలా తీర్చుకోగలనో’అంది నెమలి కన్నీరు కారుస్తూ.

‘‘పశ్చాత్తాపానికి మించిన శిక్ష మరొకటి లేదు. నేను మనస్పూర్తిగా క్షమిస్తున్నాను‘‘అని నెమలిని కౌగిలించుకుంది కాకి. అపుడే వచ్చిన పిచుక విషయం తెలుసుకుని బాధపడడమే కాక, తాను చేసిన తప్పుకు సిగ్గుతో తలవంచుకుంది.

జరిగిన విషయాలన్నీ మరచిపోయి మనం మంచి నేస్తాలుగా ఉండిపోదాం అంటూ పిచ్చుక, నెమలిని దగ్గరకు తీసుకుని ప్రేమతో కౌగిలించుకుంది కాకి.

కపటబుద్ధి

అనగనగా ఒక అడవి. ఆ అడవికి రాజు ఒకసింహం. నక్క, ఒంటె సింహానికి సేవచేసేవి. కొన్ని సంవత్సరాల తరువాత సింహం బాగా ముసలిదైపోయింది. అంతకుముందులా చురుకుగా పంజా విసరడం, జంతువుల మీదకు లంఘించడం వంటివి చేయలేకపోయింది. అప్పుడప్పుడు పస్తులు కూడా ఉండేది. ఒకసారి సింహానికి చాలా రోజుల వరకు ఆహారం దొరకలేదు.

అప్పుడు సింహం నక్కను పిలిచి ‘‘నాకు బాగా ఆకలిగా ఉంది.తినడానికి ఏమైనా తీసుకురా!’’ అని అడిగింది. ఆ సమయంలో ఒంటె గుహ బయట కాపలా కాస్తోంది. అప్పుడు ఆ జిత్తులమారి నక్క ‘‘ఇలాంటి సమయంలో మనకు ఆహారంగా ఒంటె ఏమైనా ఉపయోగపడుతుందా రాజా?’’ అని అమాయకంగా అడిగింది. ‘‘ఆ విధంగా ఆలోచించడానికి నీకు ఎంత ధైర్యం? అతను నా సేవకుడు. అతడిని రక్షించడం నా బాధ్యత,’’ అంది సింహం కోపంగా.

‘‘కానీ, రాజా! ఒకవేళ ఒంటె తనకు తానుగా మీకు ఆహారంగా సమర్పించుకుంటే...’’ అంది నక్క.
సింహం ఒక్క క్షణం ఆలోచించి ‘‘అలా అయితే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు’’ అంది.
అప్పుడు నక్క నెమ్మదిగా ఒంటె దగ్గరకు వెళ్ళి రహస్యంగా, ‘‘మిత్రమా! మన రాజును సంతోషపెట్టడానికి ఇదొక మంచి అవకాశం. ఆయన చాలా ఆకలితో ఉన్నాడు. మనల్ని మనం ఆహారంగా ఆయనకు సమర్పించుకుందాం. రాజుగారు చాలా సంతోషించి మనకు మంచి బహుమతులు ఇస్తారు’’ అంది.

అందుకు సమాధానంగా ఒంటె, ‘‘అయితే మిత్రమా! ముందు ఆ బహుమతి పొందే అవకాశం నువ్వే తీసుకో’’ అంది. నక్క ఒప్పుకుంది. రెండూ కలిసి లోపలికి వెళ్ళాయి. ముందుగా నక్క సింహంతో, ‘‘రాజా! మీరు ఆకలితో ఉన్నారు. దయచేసి నన్ను తిని మీ ఆకలి తీర్చుకోండి’’ అని ఎంతో వినయంగా పలికింది. అది విని సింహం చాలా సంతోషించినట్టు కనిపించింది. ‘‘నువ్వు నా సేవకుడవయినందుకు నాకు ఆనందంగా ఉంది. నీకేం కావాలో కోరుకో’’ అని చెప్పింది. అది వినగానే ఒంటె కూడా తన విశ్వాసాన్ని చూపించడానికి తొందరపడింది. ‘‘ఓ రాజా! నక్కను వదిలిపెట్టండి. దానికి బదులుగా నన్ను తినండి’’ అంది.

ఒంటె నుండి ఆ మాటల కోసమే ఎదురుచూస్తోంది సింహం. అంతే ఒక్కసారిగా ఒంటెపై దాడి చేసింది. ‘‘అయ్యో... రాజా! ఇదేమిటి? బహుమతి ఇస్తారనుకుంటే ఇలా చేస్తున్నారు?’’ అని ఆందోళనగా అంది ఒంటె. కపటమైన నక్క ‘‘ఇదే నీకిచ్చే గొప్ప బహుమతి. నువ్వు చాలా అదృష్టవంతుడివి కాబట్టే నీ యజమాని చేతిలో మరణిస్తున్నావు,’’ అంది కుటిలంగా నవ్వుతూ.

ఒంటె మాంసాన్ని సింహం కడుపు నిండా తిన్నది. మిగిలిన మాంసాన్ని నక్క తినేసింది.

బుద్ధిబలం

ఒక గ్రామంలో రాముడు, భీముడు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. భీముడు పేరుకు తగ్గట్టుగానే ఎత్తుగా, బలంగా ఉండేవాడు. రాముడు పొట్టిగా, సన్నగా ఉండేవాడు. కాని తెలివైనవాడు. ఒకరికి కండబలం ఉంటే మరొకరికి బుద్ధిబలం ఉంది. ఒకరోజు వారిద్దరూ పొరుగూరి సంతకు వెళ్ళి తిరిగి రాసాగారు. ఒక అడవి పక్కనుండి నడుచుకుంటూ వస్తూంటే వారికి ఒక చిన్న చేతిసంచి దొరికింది. ఆ సంచిని తెరిచిచూస్తే అందులో ఎంతో విలువైన వజ్రాలు ఉన్నాయి. ‘‘మనం చాలా అదృష్టవంతులం. ఈ వజ్రాలతో మన దారిద్య్రం తీరిపోతుంది,’’ అన్నాడు భీముడు సంతోషంగా.

‘‘నిజమే కానీ, మనం ఊరు చేరేవరకు వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ దారిలో దొంగలు దాడి చేస్తుంటారని విన్నాను’’ అన్నాడు రాముడు.

‘‘భయపడకు మిత్రమా! నా గురించి నీకు తెలియదా? ఎంతమంది వచ్చినా నా ముందు తోక ముడుచుకుని పారిపోవాల్సిందే!’’ అంటూ భీముడు మీసం దువ్వాడు.

ఆ వజ్రాలను భీముడు తన సంచిలో పెట్టుకుని దానిని జాగ్రత్తగా పట్టుకున్నాడు. కొంతదూరం వెళ్ళాక వాళ్లు అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకోసాగారు. ఇద్దరికీ కాస్త కునుకు పట్టింది. అలా ఎంతసేపు నిద్రపోయారో వాళ్లకి తెలీదు. ఇంతలో ఎవరో వచ్చిన అలికిడి విని కళ్ళు తెరిచారు. ఎదురుగా ముగ్గురు దొంగలు నిలబడి ఉన్నారు.

‘‘మర్యాదగా మీ దగ్గరున్నదంతా ఇచ్చి ప్రాణాలు రక్షించుకోండి’’ కత్తి చూపిస్తూ కరకుగా అన్నాడొకడు. రాముడు వణికిపోతూ ‘‘నా దగ్గర ఏమీ లేవు. నా కూరగాయల సంచి ఉంది తీసుకోండి’’ అన్నాడు.

భీముడు ‘‘ఒరేయ్! నా దగ్గరున్న ఈ సంచిలో వజ్రాలున్నాయి. దమ్ముంటే రండిరా’’ అన్నాడు సంచిని వారికి చూపిస్తూ.

దొంగలు భీముడుతో కలబడ్డారు. భీముడు ఒంటి చేత్తోనే వారిని మట్టి కరిపించాడు. అయితే అందులో ఒక దొంగ చాలా నేర్పుగా అతని చేతిలో ఉన్న సంచి లాక్కుని పారిపోయాడు. భీముడు తేరుకునేలోపు మిగతా దొంగలు కూడా పరిగెత్తారు. వజ్రాలు పోయాయని భీముడు బాధ పడసాగాడు. అప్పుడు రాముడు ‘‘బాధపడకు, వజ్రాలు మన దగ్గరే ఉన్నాయి. నువ్వు నిద్రిస్తున్న సమయంలో నీ సంచిలోని వజ్రాలను తీసి వాటి స్థానంలో కొన్ని రాళ్లు పెట్టాను. వజ్రాలను నా కూరగాయల సంచి అడుగున దాచాను,’’ అంటూ తీసి చూపించాడు. కండబలంకంటే బుద్ధిబలం గొప్పదని భీముడు ఒప్పుకున్నాడు. తరువాత స్నేహితులిద్దరూ ఆనందగా ఇంటిదారి పట్టారు.

గాడిద తెలివి

రామభద్రపురంలో గోపన్న అనే రజకుడు ఉండేవాడు. అతని దగ్గర ఒక గాడిద ఉండేది. గోపన్న ఆ గాడిదతో ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు బండచాకిరి చేయించేవాడు. కానీ దానికి ఏ రోజూ కడుపునిండా తిండి పెట్టిన పాపాన పోలేదు. దాంతో గోపన్న మీద గాడిదకు చాలా కోపంగా ఉండేది.

ఒకరోజు ఆ ఊరి కరణం భార్య ఉతకడానికి రెండు పట్టుచీరలు వేసింది. అవి చాలా విలువైనవి. అవంటే ఆమెకు ప్రాణం. వాటిని గోపన్నకు ఇస్తూ ఎన్నో జాగ్రత్తలు చెప్పింది.
ఆమె మాటలు వింది గాడిద. రోజూ కడుపు మాడ్చే గోపన్నకు బుద్ధి చెప్పాలనుకుంది. గాడిదను చెరువు వైపు తోలాడు గోపన్న. అది అక్కడికి చేరేలోపు తనూ వెళ్ళిపోవచ్చని సబ్బులు కొనడానికి బజారుకు వెళ్ళాడు. అదే అవ కాశంగా తీసుకుని గాడిద తన మీదున్న బట్టలమూటతో ఊరికి దూరంగా ఉన్న అడవిలోకి వెళ్ళి దాక్కుంది.

చెరువు దగ్గర గాడిద కనిపించకపోవడంతో లబోదిబోమన్నాడు గోపన్న. ఊరంతా వెతికాడు. దొంగలెవరైనా గాడిదను దారి మళ్లించి తన బట్టల మూటతో ఉడాయించి ఉంటారేమోనన్న ఆలోచన కలగగానే గోపన్న ఒళ్ళంతా చెమట పట్టింది. ‘అమ్మో అందులో కరణం గారి భార్య పట్టుచీరలు కూడా ఉన్నాయి. అవి పోయాయని తెలిస్తే తన పని గోవిందో గోవిందా!’ అనుకుని భయంతో తలబాదుకున్నాడు.

ఆ ఆపద నుండి ఎలా గట్టెక్కాలో తోచని గోపన్న పనికి వెళ్ళక దిగులుగా ఇంట్లోనే దాక్కుండిపోయాడు. తిండి మానేసాడు. గాడిద కనిపించక పోయేసరికి దాని విలువ అతనికి తెలిసి వచ్చింది. తన కోసం అది చేసిన సేవలు గుర్తుకు వచ్చాయి. ‘పాపం ఎక్కడుందో, ఏం తింటుందో? దాన్ని తీసుకెళ్ళిన దొంగాడు తన దగ్గరే ఉంచుకున్నాడో లేదా ఎటైనా తోలేసాడో!?’ అని జాలిగా అనుకున్నాడు నాలుగు రోజులు గడిచాయి. కరణం భార్య తన చీరల కోసం మనిషిని పంపించింది. ఆరోగ్యం బాలేక ఇంకా ఉతకలేదని చెప్పి ఆ పూటకి తప్పించుకున్నాడు గోపన్న.

వారం రోజుల తరువాత గాడిద తిరిగి ఇంటికి వచ్చింది. దాని మెడలో కరణం భార్య పట్టుచీరలు ఉన్నాయి. వాటిని చూడగానే గోపన్న ఆనందంతో తబ్బిబ్బయ్యాడు. సంతోషం ఆపుకోలేక గాడిదను పట్టుకుని ఏడ్చేశాడు.‘‘ఒరే నువ్వు గాడిదవు కావురా, నా కొడుకువి. పెద్ద ఆపదను తప్పించిన ఆపద్బాంధవుడివి. ఈ చీరల విలువ తెలిసి వీటిని తీసుకుని దొంగ దగ్గర నుండి తప్పించుకుని వచ్చేసావా? ఇకనుండి నీతో పనులు చేయించను. నా బిడ్డలా చూసుకుంటాను’’ అంటూ గాడిద వీపును ప్రేమగా నిమిరాడు. గోపన్న ఆరోజు నుండి గాడిదను అభిమానంగా చూసుకోసాగాడు.

దొంగను మించిన దొంగ

పూర్వం జంపయ్యు, మొగలయ్యు అనే పేరుమోసిన దొంగలు ఉండేవారు. ఎవరి ప్రాంతాలలో వారు పెద్దదొంగగా పేరు సంపాదించారు. ఒకరి గురించి వురొకరు విన్నారు గానీ, ఒకరినొకరు కలుసుకోలేదు.

అనుకోకుండా ఒకసారి ఇద్దరూ కలుసుకున్నారు. జంపయ్యును తన ఇంటికి భోజనానికి పిలిచాడు మొగలయ్యు. అతడి తెలివితేటలు ఏమాత్రమో తెలుసుకుందామనే కుతూహలంతో మాత్రమే వెళ్లాడు జంపయ్య. మొగలయ్య బంగారు గిన్నెలో భోజనం పెట్టాడు. జంపయ్యు కన్ను ఆ గిన్నెపై పడింది. ‘ఎలాగైనా దాన్ని దొంగిలించాలి’ అనుకున్నాడు. మొగలయ్యు అతని ఉద్దేశాన్ని పసిగట్టి జాగ్రత్త కోసం ఒక ఉపాయం ఆలోచించాడు. ఆ గిన్నెను కొంచెం కదిలించినా ఒలికిపోయేటంత నిండా నీటిని పోసి, దాన్ని ఉట్టి మీద పెట్టాడు. సరిగ్గా ఆ ఉట్టి కిందే అతను పడుకున్నాడు.

జంపయ్యుకు ఆ ఇంట్లోనే వురొక చోట పడక ఏర్పాటు చేశాడు. మొగలయ్యు గాఢ నిద్రలో ఉండగా జంపయ్యు వెళ్ళి కొన్ని బూడిద కచ్చికలు ఒక్కొక్కటిగా బంగారు గిన్నెలో వేశాడు. అవి నీటిని పీల్చుకున్నాయి. జంపయ్య ఆ గిన్నెను దొంగిలించి, దగ్గరలో ఉన్న చెరువులో మొలలోతు నీళ్లలో గిన్నెను పాతిపెట్టి, గుర్తుగా ఒక కర్రను గుచ్చి ఏమీ ఎరగనట్లు తిరిగి వచ్చి పడుకున్నాడు.
మొగలయ్యు మెలకువ వచ్చి చూడగా గిన్నె కనిపించలేదు.

అది జంపయ్యు పనే అనుకొని అతని దగ్గరకు వచ్చి పరిశీలించగా మొలవరకు నీటితో తడిసి ఉండటం గవునించాడు. వెంటనే చెరువు దగ్గరకు పరుగెత్తి మొగలయ్యు గుర్తుగా పెట్టిన కర్ర దగ్గర వెతికి గిన్నెను తెచ్చుకున్నాడు.

వురునాడు జంపయ్యు ఆ గిన్నెను చూసి ‘‘ఇలాంటివి నీ దగ్గర రెండు గిన్నెలు ఉన్నాయూ?’’ అని అడిగాడు. అప్పుడు మొగలయ్యు తన దగ్గర ఒక్క గిన్నె మాత్రమే ఉందని, అది నిన్నటిదేనని చెప్పాడు. జంపయ్యుకు అంతా అర్థవురుుపోరుుంది. ‘దొంగను దొంగే పట్టాలి కదా’! అని వునసులో అనుకుని ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు.

షవర్ బాత్ స్నేహితులు

ఒక అడవిలో ఒక ఏగునుల గుంపు ఉండేది. ఆ గుంపులో నిక్కి అనే ఒక ఏనుగు పిల్ల ఉండేది. ఆ గుంపులో అదొక్కటే పిల్ల ఏనుగు కావడంతో దానికి ఆడుకోవడానికి స్నేహితులు ఉండేవి కాదు. అది పేరుకు పిల్ల ఏనుగే కానీ ఆ అడవిలో ఉండే మిగతా అన్ని జంతువుల కంటే ఎత్తుగా, లావుగా ఉండేది. నిక్కికి స్నేహితులు లేకపోవడంతో ఒంటరితనంతో బాధపడేది. ఒకరోజు దానికి ఆ అడవిలో ఉన్న మిగతా జంతువుల పిల్లలు ఆడుకోవడం కనిపించింది. వెంటనే వాటి దగ్గరకు వెళ్లింది.

‘‘హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నిక్కి. నేను కూడా మీతో ఆడతాను. నన్నూ మీ జట్టులోకి చేర్చుకోరా?’’ అని వాటిని అడిగింది నిక్కి.

‘‘అమ్మో! నువ్వు చూడు ఎంత భయంకరంగా ఉన్నావో, నీ కాళ్ళ కిందపడితే మేము చచ్చిపోతాం’’ అంది కుందేలు.

‘‘అయినా నువ్వు మాతో ఏ ఆట ఆడగలవు? ఒంటికాలి మీద గెంతగలవా? దాగుడుమూతలు ఆడగలవా? చెట్టెక్కి ఊగగలవా? ఇంత పెద్ద శరీరంతో నువ్వు ఏ ఆట ఆడగలవు చెప్పు,’’ అంటూ కిచా కిచా నవ్వింది కోతి.

అది విని మిగతా జంతువులు ఎగతాళిగా నవ్వాయి. నిక్కికి బాధ కలిగింది. అయినా వాటి మాటల్లో నిజం లేకపోలేదు. తనకు ఒంటికాలి మీద గెంతడం రాదు. చెట్లెక్కడం అంతకన్నా రాదు. పాపం నిక్కి దూరంగా కూర్చుని వాళ్ళు ఆడుకునే ఆటలను చూస్తూ సంతోషించింది.
అది ఎండాకాలం... ఒకరోజు కోతి, కుందేలు, సింహం పిల్లలు కలిసి చాలాసేపు ఆడుకున్నాయి. తరువాత వాటికి దాహం వేసి చెరువు దగ్గరకు వెళ్లాయి. అప్పటికే నిక్కి అక్కడ ఉంది. చెరువులో నిలబడి తొండంలో నీళ్ళు నింపుకుని తన మీద చిలకరించుకుంటోంది.

‘‘ఏయ్ ఆ నిక్కిని చూడండి! ఎంత చక్కగా స్నానం చేస్తోందో!’’ అంటూ గట్టిగా అరిచింది కోతి.
‘‘ఎంచక్కా షవర్‌బాత్ చేస్తోంది. అలా నీళ్ళలో తడుస్తుంటే చాలా బావుంటుంది.’’ అంది సింహం పిల్ల.

నెమ్మదిగా అవన్నీ నిక్కి దగ్గరకు పరుగెత్తాయి. ‘‘నిక్కీ! నిక్కీ! మా మీద కూడా అలా నీళ్ళు పోయవా?’’ అంటూ అడిగాయి. నిక్కి తొండంతో వాటి మీద నీళ్ళు చిలకరించింది. ఆ నీళ్ళలో తడిసిపోతూ అన్నీ కేరింతలు కొట్టాయి.
‘‘మనకి ఈ ఆట ఆడటం రాదు. ఒక్క నిక్కీకే వచ్చు’’ అంది కుందేలు పిల్ల. ఆ మాట విని మిగిలిన పిల్లలన్నీ అవునంటూ ఒప్పుకున్నాయి.
‘‘నిక్కీ! మనం రేపు ఇక్కడే ఈ ఆట ఆడుకుందామా? మా జట్టులో కలుస్తావా? ప్లీజ్’’ అంటూ బతిమిలాడాయి. నిక్కి సరేనంది. ఇక ఆరోజు నుండి నిక్కికి కూడా బోలెడుమంది స్నేహితులు దొరికారు.

వ్యాపార వారసుడు

ఒక ఊళ్ళో ఒక వర్తకుడు ఉండేవాడు. అతడు చాలా ధనవంతుడు. ఆ వర్తకుడికి ముగ్గురు కొడుకులు. తనకు వయసు మీద పడుతుండడంతో తన వ్యాపారలావాదేవీలను కొడుకులకు అప్పగించాలి అనుకున్నాడు వర్తకుడు. తన కొడుకులలో అందుకు సమర్థుడు ఎవరో తెలుసుకోవాలనుకున్నాడు.

ఒకరోజు ముగ్గురు కొడుకులనూ పిలిచి, ‘‘అబ్బాయిలూ! ఈ ఆస్తిపాస్తులన్నీ మీవే. నా తరువాత వాటిని ఎవరికో ఒకరికి అప్పగిస్తాను. నేను ఆరునెలలపాటు తీర్థయాత్రలకు వెళ్తున్నాను. మీకు తలా కొంత ధనం ఇస్తాను. వాటిని మీకు ఇష్టం వచ్చినట్టుగా ఖర్చుచేయండి’’ అని చెప్పాడు. తన దగ్గర సిద్ధం చేసుకుని ఉన్న బంగారు కాసుల్లోంచి పెద్దవాడికి మూడు వాటాలు, రెండో వాడికి రెండు వాటాలు, చిన్నవాడికి ఒక వాటా ఇచ్చాడు.

పెద్దవాడు తండ్రి తనకు మూడు వాటాలు ఇవ్వడంతో చాలా సంతోషించాడు. ‘నాన్నకు నేనంటే చాలా ఇష్టం. ఆస్తంతా నాకే అప్పగిస్తాడనడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఇంకేం కావాలి?’ అనుకున్నాడు. తండ్రి నమ్మకాన్ని నిలబెట్టాలని తన ఖర్చులన్నీ తగ్గించుకుని, ఒక్క బంగారు కాసు కూడా ఖర్చు చేయకుండా సాదాసీదాగా బతకసాగాడు.

రెండోవాడు ‘తండ్రి ఎలాగూ నాకు ఆస్తి నిర్వహణ బాధ్యత అప్పగించడు. బంగారు కాసులు పంచడంలోనే అతని ఉద్దేశ్యం అర్థమైంది. ఇక వేరే ఆలోచన ఎందుకు? నా వంతుకు ఏం వస్తే అది తీసుకుని సంతోషంగా ఉండాలి’ అనుకుని తన దగ్గరున్న ధనాన్ని విలాసాల కోసం ఖర్చు చేయసాగాడు. మూడోవాడు అన్నయ్యలిద్దరి కంటే భిన్నమైనవాడు. ‘చిన్న వాడిని కాబట్టి నాకెప్పుడూ తక్కువ భాగమే వస్తుంది. నేనేంటో రుజువు చేసి చూపిస్తాను’ అనుకున్నాడు. ఆరునెలల గడిచాక తండ్రి తీర్థయాత్రల నుండి తిరిగి వచ్చాడు. కొడుకులను పిలిచి తను ఇచ్చిన ధనాన్ని ఏ విధంగా ఖర్చు చేశారో చెప్పమని అడిగాడు.

పెద్దవాడు ‘‘నాన్నా! నేను ఒక్క కాసు కూడా తీయలేదు. నా అవసరాలు తగ్గించుకుని మీరిచ్చిన ధనాన్ని అలాగే జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాను’’ అన్నాడు గర్వంగా.

తండ్రి పెదవి విరిచాడు. ‘‘ఏం లాభం? నువ్వు తినలేదు. ఇతరులను తిననివ్వలేదు’’ అని రెండో కొడుకు వైపు చూశాడు.

‘‘మీరు చెప్పింది నిజమే నాన్నా! నేనయితే ఒక్క కాసుకూడా మిగల్చకుండా అన్నీ ఖర్చు చేసేశాను’’ అని చెప్పాడు రెండోవాడు.

ఇక మూడోవాడి వంతు వచ్చింది. అతను తండ్రి ఇచ్చిన దానికి రెండురెట్లు ఎక్కువ ధనాన్ని ఆయన ముందుంచి, ‘‘నాన్నా! నేను వ్యాపారం చేశాను. మొదటి నెల లాభాలు వచ్చాయి. లాభాన్ని పెట్టుబడిగా పెడుతూ వచ్చాను. చివరకు ఇంత సంపాదించగలిగాను’’ అన్నాడు.

తండ్రి ముఖంలో సంతోషం కనిపించింది. వ్యాపార దక్షత కలిగిన చిన్న కొడుకుకే తన వ్యాపారాన్ని అప్పగించాడు.

ఆలోచనా సరళి

కాశీనాథ్ అనే పేద యువకుడు ఒకసారి అడవి మార్గంలో ప్రయాణిస్తున్నాడు. అతను విష్ణుభక్తుడు. అతనికి మార్గమధ్యంలో ఒక సాధువు కలిశాడు.

‘‘ఏం నాయనా! ఒంటరిగా అడవిలో ఎక్కడికి వెళుతున్నావు?’’ అని ప్రశ్నించాడు సాధువు.
‘‘పని వెతుక్కోవడానికి పట్నం వెళుతున్నాను స్వామీ! ఇది దగ్గరదారి కదా అని ఇలా వచ్చాను’’ అని ఎంతో వినయంగా సమాధానం చెప్పాడు.

ఇద్దరూ కలిసి నడక సాగించారు. కొంతదూరం ప్రయాణించాక అలసిపోయారు. కాసేపు విశ్రాంతి తీసుకుందామని ఒక చెట్టు కింద ఆగారు. వాళ్ళకు కొద్దిదూరంలో ఒక నక్క కనిపించింది. దాని కాలికి గాయం కావడంతో నడవలేక కుంటుతోంది.

‘‘ఆ నక్కను చూశారా స్వామీ! పాపం నడవలేకపోతోంది. మనుషులం మనం ఇంత కష్టపడితేగానీ పొట్ట నిండటం లేదు. మరి వేటాడలేని ఈ నక్క పొట్ట ఎలా నిండుతుంది’’ అన్నాడు కాశీనాథ్ ఎంతో జాలిగా.

సాధువు జవాబు చెప్పలేదు. చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. ఇంతలో హఠాత్తుగా అంతవరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో కలకలం మొదలైంది. పక్షులు గోలగోల చేస్తూ అటుఇటు ఎగరసాగాయి. ఉడుతలు గబగబా చెట్టెక్కాయి. కుందేళ్ళు బొరియల్లోకి పారిపోయాయి.
‘‘ఏదో ప్రమాదం ముంచుకొస్తున్నట్టుంది. పద ఈ చెట్టెక్కుదాం’’ అని సాధువు చెప్పడంతో కాశీనాథ్ ఆయన్ని అనుసరించాడు. ఇద్దరూ ఒక పెద్ద చెట్టు ఎక్కి గుబురుకొమ్మల్లో దాక్కున్నారు.
ఒక సింహం తను వేటాడిన జంతువును ఆ చెట్టు కిందకు ఈడ్చుకు వచ్చింది. తను తినగలిగినంత తిని మిగతాది అక్కడే వదిలి వెళ్ళిపోయింది. సింహం అటు వెళ్ళగానే నక్క వచ్చి సింహం వదిలి వెళ్ళిన ఆహారం తినసాగింది.

ఇదంతా చెట్టు మీద నుంచి చూస్తున్న కాశీనాథ్, ‘‘చూశారా స్వామీ! భగవంతుడికి ఎంత పక్షపాతమో! నేను చిన్నప్పటినుంచి ఆ ఏడుకొండలవాడిని సేవిస్తూ వస్తున్నాను. నేనెన్ని కష్టాలలో ఉన్నా ఏ రోజూ దేవుడు నాకు సహాయం చేయలేదు. ఆ నక్క ఒక్కసారి కూడా భగవంతుడిని పూజించి ఉండదు. అయినా దానిని కష్టకాలంలో ఆదుకున్నాడు’’ అన్నాడు కించిత్తు నిరసనగా.

సాధువు మళ్ళీ నవ్వాడు. ‘‘నాయనా! నువ్వు ఒక కోణంలోంచే ఆలోచిస్తూ నిస్సహాయురాలైన నక్కతో నిన్ను పోల్చుకుంటున్నావు. భగవంతుడు అన్ని అవయవాలు సరిగ్గా ఇచ్చి నిన్ను బలవంతుడిని చేశాడు. అంటే సింహంలా కష్టపడి నీ ఆహారాన్ని నువ్వు సంపాదించుకోగలవు. నువ్వు తినగా మిగిలినది ఇతరులకు దానం చెయ్యగలవు. అంతటి శక్తిసామర్థ్యాలు భగవంతుడు నీకు ఇచ్చాడు. అంతేకాని ఎవరిమీదైనా ఆధారపడి తినడానికి నువ్వు కుంటినక్కవు కాదు’’ అని చెప్పాడు. దాంతో కాశీనాథ్ తను ఆలోచించిన పద్ధతికి సిగ్గుపడ్డాడు.

సీతాకోకచిలుక గర్వం

ఒక గులాబి తోటలో ఒక సీతాకోక చిలుక ఉండేది. అది రంగురంగుల రెక్కలతో చూడటానికి ఎంతో అందంగా ఉండేది. తన అందం పట్ల దానికి ఎంతో గర్వం, ఆ గర్వంతో పాటు కొంచెం మూర్ఖత్వం కూడా ఉండేది.

ఒకరోజు ఒక ఏనుగుపిల్ల ఆ తోటకు వచ్చింది. సీతోకోకచిలుక రివ్వున ఎగిరి దాని చెవి మీద వాలింది.

‘‘నా చెవి మీద ఎవరున్నారు?’’ అని అడిగింది ఏనుగు.

‘‘హలో! నీకు నేనెవరో తెలియదా? ఈ ప్రపంచంలో చాలా అందంగా ఉండే ఏకైక జీవిని నేనే. సీతాకోకచిలుకను’’ అన్నది ఎంతో గర్వంగా.
‘‘అవునా! నిన్ను కలుసుకోవడం ఆనందంగా ఉంది. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళుతున్నావు?’’ అని అడిగింది ఏనుగు.

‘‘నేను ఎక్కడికైనా వెళ్ళగలను. తూర్పునుండి పడమరకు, పడమర నుండి తూర్పుకు ఎగిరి వెళ్ళగలను. నువ్వు నాలా ఎగురగలవా?’’ కొంటెగా అన్నది సీతాకోకచిలుక.

‘‘ఊహూ, ఎగురలేను’’ అన్నది ఏనుగు బాధగా.

‘‘చూసావా? మరి నేను నీకంటే గొప్పదాన్నన్నమాట. అవునా?’’ అని అడిగింది సీతాకోకచిలుక.

‘‘అవును. గొప్పదానివే’’ అని ఒప్పుకుంది ఏనుగు.

సీతాకోకచిలుకకు పట్టరాని సంతోషం కలిగింది. ‘‘ఒకరకంగా మనమిద్దరం ఒకటే తెలుసా? నీకు తొండం ఉంది. నాకు తొండం ఉంది. అయితే నా తొండంతో నేను పూల మకరందాన్ని తీయగలను. నువ్వు తీయలేవు. కాబట్టి నేను నీకంటే గొప్ప’’ అన్నది సీతాకోక చిలుక మరింత బడాయిగా.

‘‘నిజమే’’ అంది ఏనుగు.

‘‘నీకెన్ని కాళ్లున్నాయి?’’ అని అడిగింది సీతాకోకచిలుక. ‘నాలుగు’ అని చెప్పింది ఏనుగు. ‘‘ఇందులో కూడా నేనే గొప్ప. నాకు ఆరు కాళ్ళున్నాయి’’ అంది. ఇంతలో పెద్ద గాలి వీచింది. ఆ గాలి వేగానికి సీతాకోకచిలుక పట్టుతప్పి ఎగిరిపోసాగింది. ‘‘అయ్యో! నన్ను కాపాడండి... కాపాడండి’’ అని గట్టిగా కేకలు వేసింది.

అది విన్న ఏనుగు వెంటనే తొండంతో సీతాకోకచిలుకను పట్టుకుంది. గండం గడిచిందని ఊపిరి పీల్చుకున్న సీతాకోకచిలుకకు, ఆ సంఘటనతో బుద్ధి వచ్చింది. గొప్పలు చెప్పుకోవడం మానేసింది.

బీర్బల్ తెలివి

ఒకరోజు అక్బరు చక్రవర్తి, మంత్రి బీర్బల్ పచ్చికబయళ్లలో నడుస్తున్నారు. అక్కడ ఒక గొర్రెలకాపరి చక్రవర్తికి చెందిన గొర్రెలను మేపుతున్నాడు. అక్బరు ఆ గొర్రెలు సన్నగా ఉండటం గమనించాడు.

‘‘ఏమోయ్! నువ్వు గొర్రెలను సరిగ్గా మేపటం లేదు. ఇలాగయితే నీకు శిక్ష తప్పదు’’ అని గొర్రెలకాపరితో కోపంగా అన్నాడు అక్బరు.

కాపరి భయంతో వణికిపోయాడు. తనను రక్షించమన్నట్టు దీనంగా బీర్బల్ వైపు చూశాడు.
బీర్బల్ కల్పించుకుని ‘‘ప్రభూ! మనుషులైనా పశువులైనా ఎంత తిన్నా సన్నగానే ఉంటారు. అది వారి వారి శరీరతత్త్వంపై ఆధారపడి ఉంటుంది’’ అన్నాడు.

అక్బరు కోపం రెట్టింపయ్యింది. ‘‘నా మాటను ఖండించడం నీకు అలవాటైపోయింది. మనుషులకు, గొర్రెలకు పోలికేమిటి? సరే, ఒక గొర్రెను మనతో తీసుకువెళ్ళి కడుపునిండా గడ్డి పెడదాం. అప్పుడు చూద్దాం గొర్రె లావెక్కుందో లేదో’’ అన్నాడు.

గొర్రెల కాపరిని రక్షించబోయి బీర్బల్ తను ఇరుక్కున్నాడు. ఆ ఆపదలోంచి బయటపడే మార్గం గురించి ఆలోచిస్తూ ఒక గొర్రెను తీసుకుని చక్రవర్తిని అనుసరించాడు.

అక్బరు ఆ గొర్రెను ఒక సేవకుడికి అప్పగించి దానికి బాగా గడ్డి తినిపించమని చెప్పాడు. సేవకుడు పగలంతా గొర్రెను కనిపెట్టుకుని ఉండి మామూలుగా అది తినేదానికంటే రెట్టింపు గడ్డిని తినిపించసాగాడు. రాత్రిపూట దాన్ని ఒక కొట్టంలో వదిలేసివెళ్లిపోయేవాడు. బీర్బల్ బాగా ఆలోచించి ఆ గొర్రె ఉండే కొట్టంలో రాత్రిపూట ఉండేలా ఒక కసాయిని నియమించాడు. అతను చేయాల్సిన పని గొర్రెకు కనబడేలా కత్తిని నూరుతూ ఉండటమే.

కసాయి కత్తిని చూసి గొర్రె చాలా భయపడింది. దానికి రాత్రిపూట కంటి మీద కునుకు లేకుండా పోయింది. దాంతో తిన్న తిండి ఒంటబట్టక మరింతగా బక్కచిక్కిపోయింది. కొన్ని రోజుల తరువాత అక్బరు వచ్చి గొర్రెను చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు బీర్బల్ ఆయనతో ఉన్నాడు.
‘‘నువ్వు చెప్పింది నిజమే బీర్బల్. కానీ... నేనెందుకో నీ మాటతో పూర్తిగా ఏకీభవించలేకపోతున్నాను. అంత తిండి తిన్న గొర్రె లావెక్కకపోవడం ఏమిటి?’’ అని అడిగాడు.

‘‘ఏమీ లేదు ప్రభూ, మనుషులైనా జంతువులైనా లావెక్కకపోవడానికి కారణం భయం’’ అంటూ తను కసాయిని నియమించిన విషయాన్ని వివరించాడు.

అక్బరు మెచ్చుకోలుగా బీర్బల్ భుజం తట్టాడు.

సమయస్ఫూర్తి

విదర్భపురాన్ని జయేంద్రుడు అనే రాజు పరిపాలించేవాడు. ఒకరోజు ఆ రాజు నిద్రిస్తున్న సమయంలో ఆయనకు ఒక కల వచ్చింది. ఆ కలలో అతని నోటి పళ్ళన్నీ ఊడిపోయి, ఒక పన్ను మాత్రమే మిగిలింది. మెలకువ వచ్చిన జయేంద్రుడు ఆ కలకు అర్థం ఏమిటో తెలుసుకోవాలనుకున్నాడు. మరునాడు కలలకు అర్థం చెప్పగలిగే జ్యోతిష్యులను పిలిపించమని సభలో మంత్రు లను ఆదేశించాడు.

రెండు రోజుల తరువాత ఇద్దరు ప్రముఖ జ్యోతిష్యులు రాజసభకు వచ్చారు. జయేంద్రుడు తన కల చెప్పి దానికి అర్థం ఏమిటో వివరించమని అడిగాడు. జ్యోతిష్యులు తమ దగ్గరున్న తాళపత్ర గ్రంథాలు చదివి, వేళ్ళ మీద చాలాసేపు లెక్కించారు.

తరువాత ఒక జ్యోతిష్యుడు ‘‘రాజా! మీ సన్నిహితులు, బంధువులు అందరూ మీకంటే చాలా ముందుగా చనిపోతారు’’ అన్నాడు. అతను చెప్పింది అక్షరాలా నిజం. శాస్త్రం అదే చెబుతోంది.
కానీ అది వినగానే జయేంద్రుడికి కోపం వచ్చింది. ఆ మాటలు ఎంతో కఠినంగా తోచాయి. భటులను పిలిచి, జ్యోతిష్యుడిని బంధించమని ఆజ్ఞాపించాడు. ఇంతలో రెండో జ్యోతిష్యుడు కల్పించుకుని, ‘‘ప్రభూ! అందరికంటే మీరు ఎక్కువ సంవత్సరాలు జీవించి రాజ్యాన్ని పరిపాలిస్తారని మీ కల చెబుతోంది. మీ సన్నిహితులు, బంధువులకంటే మీ ఆయుష్షు ఎక్కువని దీని అర్థం. అతను కూడా అదే చెప్పాడు ప్రభూ’’ అన్నాడు.

రెండో జ్యోతిష్యుడి మాటలు విని జయేంద్రుడి కోపం తగ్గింది. ‘‘మరి ఆ మాటే సరిగ్గా చెప్పవచ్చు కదా!’’ అని ఆ జ్యోతిష్యుడిని వదిలిపెట్టమని భటులకు చెప్పాడు.
రాజప్రసాదం నుండి బయటపడ్డాక తన ప్రాణాలు కాపాడినందుకు మొదటి జ్యోతిష్యుడు రెండో వ్యక్తితో కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.

‘‘ఫరవాలేదు మిత్రమా! కానీ ఒక విషయం నువ్వు గుర్తుంచుకో. ఎదుటివారికి రుచించని విషయాలు, చెడు సంగతులు చెప్పాల్సి వచ్చినప్పుడు వాటిని సూటిగా చెప్పకూడదు. నర్మగర్భంగా, డొంకతిరుగుడుగా వాళ్ళకు అర్థమయీ కానట్టుగా చెప్పాలి’’ అని సలహా ఇచ్చాడు రెండో జ్యోతిష్యుడు.

కాకి - గేదె

అది వేసవికాలం. ఎండలు విపరీతంగా మండుతున్నాయి. ఓ చెట్టు నీడలో ఒక గేదె సేదతీరుతోంది. అది తన కళ్లను సగం మూసుకొని, ఆహారాన్ని నెవురువేస్తోంది. ఇంతలో ఆ చెట్టు మీద ఒక కాకి వాలింది. ఎండ తీవ్రంగా ఉండటం వల్ల చెట్టు మీద కూడా కాస్త వేడిగానే ఉంది. చెట్టు కింద చల్లగా ఉందని ఆ కాకి నేల మీద వాలింది. వురీ నేల మీద ఎందుకులే అని, అక్కడ నుండి ఎగిరి గేదె కొమ్ముల మీద వాలింది. ఆ గేదె కాకిని అసలు పట్టించుకోకుండా అలానే కూర్చుంది. కాకి అలా ఆ గేదె కొమ్ముల మీద కాసేపు సేదతీరింది. ఇక ఎగిరి వెళదావునుకున్న సమయంలో, కాకి తన వునసులో ఇలా అనుకుంది.

‘పిచ్చి గేదె! నేను ఇంత సేపు దీని కొమ్ముల మీద కూర్చుని సేద తీరాను. దీనికి తెలియును కూడా తెలియలేదు. అంటే నేను ఈ గేదె గుర్తించలేనంత చాకచక్యంగా కూర్చున్నాను. దీనికి తెలియుకుండా నేను దీన్ని తెలివిగా వాడుకున్నాను.’ అని కాకి తన తెలివికి తనే మురిసిపోయింది.

గేదె కొమ్ముల మీద నుంచి ఎగిరి, గేదె ముందు గర్వంగా వాలింది. ‘‘నేను ఇప్పుడు వెళ్లవచ్చా?అని ఎగతాళిగా గేదెను అడిగింది.

‘‘నీలాంటి అల్పప్రాణులు నా మీద వాలి సేద తీరి వెళ్లడం నేనసలు పట్టించుకోను. ఒకవేళ నువ్వు నా మీద ఇంత సేపటి వరకు సేద తీరినందుకు నాకు కృతజ్ఞతలు తెలిపి ఉంటే నా దృష్టిలో నీ స్థాయి పెరిగేది’’ అని బదులిచ్చింది ఆ గేదె. దీంతో కాకి గర్వం పటాపంచలయింది. సిగ్గుతో తల దించుకొని మారువూట్లాడకుండా అక్కడి నుండి ఎగిరి వెళ్లిపోయింది.

వజ్రాల మూట

ఒకసారి వివేకవర్మ మహారాజు దగ్గరకు ఒక వ్యక్తి న్యాయుం కోసం వచ్చాడు. అతడు మహారాజుకు వందనం చేసి, ‘మహారాజా! నా పేరు గోపాలుడు. మా యజమాని పేరు నీలంకంఠుడు. ఆయన నాకు వజ్రాలు ఇస్తానని చెప్పి మోసం చేశారు. మీరే నాకు న్యాయుం చేయూలి’’ అని వేడుకున్నాడు.

‘‘నీకు జరిగిన అన్యాయాన్ని వివరంగా చెప్పు’’ అన్నాడు మహారాజు.

‘‘ప్రభూ! ఒకరోజు నేను, మ యజమాని వేరే రాజ్యం నుండి ఇంటికి తిరిగి వస్తున్నాం. కుండపోతగా వర్షం కురుస్తుండటంతో దగ్గరలో ఉన్న ఒక పురాతన ఆలయుం లోపలికి వెళ్ళి తలదాచుకున్నాం. ఆ ఆలయుంలో మాకు వజ్రాలు కనిపించాయి. మా యజమాని వెంటనే వాటిని తీసుకొని మూట కట్టాడు. ‘ఈ ఆలయుంలో మనకు వజ్రాలు దొరికాయుని ఎవరితోనూ చెప్పకు. ఇంటికి చేరాక నీకు వీటిలో సగం వాటా ఇస్తాను’ అని చెప్పాడు. నా వాటాగా వచ్చే వజ్రాలను అమ్ముకుని ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చని నేను అప్పుడు ఏమీ అనలేదు. మీరే న్యాయుం చెప్పండి’’ అని వివరించాడు గోపాలుడు.

గోపాలుడి యజమాని అయిన నీలకంఠుడిని పిలిపించాడు వుహారాజు.

"మహాప్రభూ! ఇతడు చెప్పే వూటలు పచ్చి అబద్ధాలు. ఆ వజ్రాలు దొరికినవూట నిజమే. ఏ వస్తువు దొరికినా అది మీకే చెందుతుందని భావించి, ఆ వజ్రాలను నేనే స్వయంగా మూటకట్టి ఇతనితో మీ వద్దకే పంపించాను" అని చెప్పాడు. "దీనికి సాక్షులు ఎవరైనా ఉన్నారా?" అని అడిగాడు వుహారాజు. "లేకేం, నా భార్య, అత్తగారు చూశారు ప్రభూ" అన్నాడు నీలకంఠుడు.

మాహారాజు వారిద్దరినీ పిలిపించాడు. వారు వచ్చాక, వారిద్దరినీ వజ్రాలు కట్టిన మూట ఏ రంగులో ఉంటుందో చెప్పమని విడివిడిగా అడిగాడు. ఇద్దరూ వేరువేరు సవూధానాలు చెప్పారు. దీంతో నీలకంఠుడి మోసం బయుటపడింది.

"నీలకంఠా! వెంటనే వజ్రాలు నాకు అప్పగించు. గోపాలుడిని మోసం చేసినందుకు అతనికి వేయి బంగారు నాణాలు పరిహారంగా ఇవ్వు" అని తీర్పు ఇచ్చాడు.

కోతి తిక్క కుదిరింది

ఒక అడవిలోకి ఎక్కడి నుంచి వచ్చిందో కాని ఒక కోతి వచ్చి, పెద్ద రావి చెట్టు మీద ఉండసాగింది. ఆ చెట్టు మీద ఒక పావురం, పిచ్చుకల జంట, కాకి జీవిస్తున్నాయి. అవి ఒక దాని జోలికి వురొకటి వెళ్లేవి కావు. దేని ఆహారం అది సంపాదించుకుంటూప్రశాంతంగా జీవించేవి. కోతిది మాత్రం చంచల వునస్తత్త్వం.

అది ఒక్క క్షణం కూడా ఒక చోట స్థిరంగా ఉండదు. కోతులన్నీ ఇలాగే ఉంటాయి, కానీ దీనిది వురీకోతి బుద్ధి. వుధ్యాహ్నం ఎండ పూట పక్షులు వాటి గూళ్లలో చిన్న కునుకు తీస్తుంటే కోతి దబ్బువుని ఒక కొవ్ము నుండి వురొక కొవ్ము మీదకు గెంతేది. ఆ చప్పుడును శత్రువుల దాడి అనుకుని పక్షులు ఠారెత్తిపోయేవి. ప్రాణరక్షణ కోసం తలా ఒకవైపు ఎగిరిపోయేవి.

కోతి చేష్టలతో ఆ పక్షులకు వునశ్శాంతి కరువయింది. అడవిలోని మిగతా జంతువుల పరిస్థితి ఎలా ఉన్నా రావిచెట్టు మీద నివసిస్తున్న పక్షుల పరిస్థితి వురీ అధ్వాన్నంగా తయారయింది. ఒకరోజు అవన్నీ సమావేశమయ్యాయి.

‘‘రాను రాను కోతి చేష్టలు వురీ మితిమీరి పోతున్నారుు. ఎలాగోలా దీన్ని ఇక్కడ్నుంచి తరిమేయూలి’’ దిగులుగా అంది పిచ్చుక. ‘‘నాకో ఉపాయుం తట్టింది’’ అంటూ ఒక ఆలోచన చెప్పింది పావురం. ‘‘నిజంగా ఇలాగే జరుగుతుందా?’’ సందేహంగా అడిగింది కాకి.

‘‘ప్రయుత్నించి చూద్దాం. ఇది పని చేయుకపోతే వురొకటి ఆలోచిద్దాం. నాకెందుకో ఈ దెబ్బతో కోతి పని అరుుపోతుందని అనిపిస్తుంది’’ అన్నది కాకి. అన్నీ కలసి తేనెను సంపాదించి కోతి నివసించే చోట ఒక రంధ్రంలో పోశారుు. కోతి ఎప్పటిలాగే అడవిలోని జంతువులను, పక్షులను హడలగొట్టడం పూర్తయ్యాక తిరిగి వచ్చింది. వుుందు ఆ తేనెను చూసి సంశయుంగా ఒక వేలితో తాకి, నాకి చూసింది. దానికి ఆ రుచి నచ్చింది. మొత్తం తేనెను నాకేసింది. అది మొదలు ఒక వారం పాటు పక్షులు రోజూ తేనెను సంపాదించి ఆ రంధ్రంలో పోసేవి. కోతి ఆ తేనెను తాగేది. నెవ్ముదిగా అది తేనె రుచికి అలవాటు పడింది. కొన్ని తేనె చుక్కలు గొంతులో పడితే కాని ఉండలేని స్థితికి వచ్చింది.

పక్షులు తమ పథకంలో భాగంగా ఒకరోజు తేనెను పోయలేదు. రంధ్రంలో తేనె కనిపించక పోయేసరికి కోతికి పిచ్చి పట్టినంత పనైంది. చెట్టంతా వెతికింది. దానికి చిటారు కొవ్మున తేనెతుట్టె కనిపించింది. తేనె కోసం ఆతృతగా తేనెతుట్టెలో వేలు పెట్టి కెలికింది. తుట్టె కదలడంతో తేనెటీగలు పైకి లేచాయి. వందలు... వేల... తేనెటీగలు ఒక్కసారిగా కోతిపై దాడి చేసాయి. వాటి బారి నుండి తప్పించుకోవడానికి కోతి పరుగో పరుగు! తేనెటీగలేమో కోతిని వెంబడించి కసిదీరా కుట్టి వదిలారు. చావు తప్పి కన్ను లొట్టబోయిన పరిస్థితి అయి౦ది కోతికి. ఇక ఆ పరిసరాలలోకి వస్తే ఒట్టు. కోతి బాధ తప్పిపోయినందుకు పక్షులు ఆనందించాయి.

కందిరీగ సహాయం

ఒక అడవిలో ఒక చిలుక, కందిరీగ జీవిస్తూ ఉండేవి. చిలుక తనను తాను చూసుకుని గర్వంతో పొంగిపోయేది. కందిరీగను తరచుగా ఆటపట్టిస్తుండేది. ఒకరోజు చిలుక తన గూటిలో వుూడు గుడ్లు పెట్టింది. మరుసటి రోజు చిలుక నివసించే చెట్టు దగ్గరలో ఒక పిల్లి తచ్చాడుతుండడం గవునించింది. ‘‘అయ్యు బాబోయ్! నా గుడ్లను ఈ దొంగ పిల్లి తినేస్తుందేమో’’ అని తెగ కంగారు పడిపోరుుంది. అది అలా అనుకుంటూండగానే, పిల్లి ‘‘ఈ రోజుకు నాకీ గుడ్లు చాలు’’ అనుకుంటూ చెట్టును సమీపించి, మెల్లిగా చెట్టు ఎక్కడం మొదలెట్టింది. భయుంతో చెవుటలు పట్టిన చిలుక ‘‘కాపాడండి, కాపాడండి’’ అని అరవడం ప్రారంభించింది.

చిలుక అరుపులను, పెడబొబ్బలను అక్కడే తిరుగుతున్న కందిరీగ వింది. ఎందుకో అరుస్తోంది, నేను వెళ్లి దానిని కాపాడతాను’’ అని చిలుక దగ్గరకు బయులుదేరింది కందిరీగ.

కందిరీగ చిలుక గూటి దగ్గరకు వచ్చేసరికి, పిల్లి గూట్లోకి చూస్తూ ‘‘ఆహా! ఎంత అందమైన గుడ్లు, నా పంట పండింది’’ అనుకుంటూ గుడ్లను తీసుకోబోతుండగా, ఝువ్ముని ఎగురుతూ వచ్చిన కందిరీగ పిల్లి కంట్లోకి దూరింది. కంగారులో పిల్లి చెట్టు మీదినుంచి దూకేసింది. దాంతో పిల్లి కంటికి బలమైన గాయుమైంది. దానికితోడు చెట్టుపై నుంచి పడడంతో దానికి కాలు కూడా విరిగింది. గండం తప్పడంతో, కందిరీగ చిలుకతో, ‘‘మిత్రవూ, నీవిక బాధపడనవసరం లేదు’’ అని ఓదార్చింది. ‘‘నీ బుుణం ఈ జన్మలో తీర్చుకోలేను మిత్రవూ’’ అని చిలుక కందిరీగకు కృతజ్ఞతలు చెప్పింది.

‘‘నేను నా అందం చూసి తెగ గర్వపడే దానిని. ఆ గర్వంతో నేను నిన్ను ఆట పట్టించి అవవూనించేదానిని. కానీ నేను ప్రవూదంలో ఉన్నప్పుడు నువ్వు అదేమీ పట్టించుకోకుండా నన్ను కాపాడావు’’ అని పలికింది చిలుక.

‘‘సరేలే, ఈ రోజు నుంచి వున వుధ్య స్నేహం వురింత బలంగా చిగురించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిద్దాం’’ అని బదులిచ్చింది కందిరీగ.

కోతుల సహాయం

ఒక నదిలో రకరకాల అందమైన చేపలు ఉన్నాయి. ఆ నది ఒడ్డున ఒక నేరేడుచెట్టు ఉంది. ఆ చెట్టు మీద కొన్ని కోతులు ఉన్నాయి. ఆ కోతులు నేరేడుచెట్టు కొమ్మల మీద గెంతుతూ, పండ్లు కోసుకు తినేవి. అప్పుడప్పుడూ కొన్ని పండ్లు జారి కింద ఉన్న నదిలో పడిపోయేవి. ఆ పండ్లు నీళ్ళలో మునిగిపోకుండా చేపలు వాటిని పట్టుకుని జాగ్రత్తగా తీసుకువచ్చి కోతులకు అందించేవి. అలా కోతులకు చేపలకు స్నేహం కుదిరింది.

ఒకరోజు చేపలు పట్టేవాడు అటువైపు వచ్చాడు. తన బట్టల మూటను ఒడ్డు మీద పెట్టి చేపల కోసం నీటిలోకి వల విసిరాడు. ఆ వలలో ఎన్నో చేపలు పడ్డాయి. అక్కడే చెట్టు మీద ఉన్న కోతులు జరుగుతున్నదంతా చూశాయి.

‘‘అయ్యయ్యో. మన మిత్రులను వాడు ఎత్తుకుపోతున్నాడు’’ అంది ఒక కోతి.

‘‘అవునవును. ఎలాగైనా సరే మనం మన మిత్రులను రక్షించుకోవాలి’’ అంది మరో కోతి.

అన్నింటిలోకి తెలివైన ఒక కోతి చేపలను కాపాడే ఉపాయం చెప్పింది. వెంటనే ఒక కోతి చెంగున కిందకు దూకింది. చేపలు పట్టేవాడి బట్టల మూటను ఎత్తుకుని పారిపోసాగింది. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనను చేపలు పట్టేవాడు చూశాడు.

‘‘అయ్యో నా బట్టలు’’ అంటూ వలను అక్కడే వదిలేసి కోతి వెంట పరుగెత్తాడు. అప్పుడు ఇంకో కోతి గబగబ చెట్టు మీద నుంచి కిందకు దిగింది. చేపలు ఉన్న వలను విప్పి, అందులో ఉన్న చేపలను నీళ్లల్లోకి వదిలేసింది. బట్టల మూట ఎత్తుకెళ్ళిన కోతి కొద్ది దూరం వెళ్ళాక మూటను కింద పడేసి పారిపోయింది. ఈ విధంగా కోతులు తమ మిత్రులను కాపాడుకున్నాయి.

సరియైన న్యాయం

పూర్వం అవంతి రాజ్యాన్ని సునందుడనే రాజు పరిపాలించేవాడు. రాజ్యంలో సుఖశాంతులు నిండుగా ఉన్నాయి. సకాలానికి వర్షాలు పడి పంటలు బాగా పండుతున్నాయి. ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. న్యాయం నాలుగు పాదాల నడుస్తుంది. దానికి ముఖ్య కారణం ధర్మపాలుడనే న్యాయాధికారి కొలువులో పనిచెయ్యడమే.సమస్యలను న్యాయబద్ధంగా పరిష్కరించేవాడు. అందువల్ల రాజన్నా, న్యాయాధికారి ధర్మపాలుడన్నా ప్రజలకు ఎంతో ఇష్టం.

సునంద మహారాజుకి ప్రకృతంటే చాలా ప్రేమ. ప్రకృతిలో దాగిన అందాల్ని చూడడమంటే ఎంతో సరదా.అప్పుడప్పుడు వేటకు తోటకు వెడుతుండేవాడు. తనతోపాటు ఒకోసారి న్యాయాధికారిని కూడా తోడుగా తీసుకువెడుతుండేవాడు. వారిద్దరి మధ్య అభిమానం,ప్రేమ నిండుగా ఉన్నాయి. ప్రజల కష్టసుఖాల్ని తెలుసుకోవడానికి రాత్రిళ్లు మారువేషాలతో రాజ్యంలో తిరుగుతుంటారు.

ఒకరోజు ప్రశాంత వాతావరణంలో రాజుగారికి ప్రకృతి సౌందర్యం చూడాలని న్యాయాధికారిని తోడుగా తీసుకుని నగరం వెలుపలకి వెళ్లాడు. ప్రకృతి అందాలను చూస్తూ చాలా దూరం నడిచాడు. కాసేపు విశ్రాంతి తీసుకుందామని దగ్గరలో వున్న చెట్టునీడకు వెళ్ళారిద్దరూ. కూర్చుని పరిసరాల్ని నిశితంగా చూస్తున్నారు. చెట్టుకు దగ్గరలో తళతళ మెరుస్తూ ఒకటి కనపడింది. వెళ్లి తీసుకురమ్మని చెప్పాడు. ఇది వెండి ఉంగరం ప్రభూ! రాయిమాత్రం ఖరీదు కలిగింది. ఎవరిదో పేదవాడిదై ఉంటుంది. ఇక్కడ కాసేపు విశ్రమించినట్టు గుర్తులు కూడా ఉన్నాయని న్యాయాధికారి అన్నాడు.

పాపం ఎంతో కష్టపడి దీన్ని తయారు చేయించుకుని ఉంటాడు. దీనిని పోగొట్టుకున్నవాడికే చేర్చాలి అని రాజన్నాడు. అవును ప్రభు అని న్యాయాధికారి అన్నాడు.రేపే ఉంగరం పోయిందని, పోగొట్టుకున్న వాళ్లు వచ్చి తీసుకోవచ్చని దండోరా వేయిద్దామని రాజు అన్నాడు. దండోరా వింటే పోగొట్టుకున్నది నేను, నేనని ప్రజలు గుంపులు గుంపులుగా వస్తారు ప్రభూ! వాళ్లలో నిజంగా పోగొట్టుకున్న వాళ్ళెవరో గుర్తించడం చాలా కష్టం అని న్యాయాధికారి అన్నాడు. అయితే దీని ఆనవాళ్లు చెప్పిన వాళ్లకు ఇద్దామన్నాడు రాజు. అలా కూడా కష్టం ప్రభూ. ఈ చెట్టుకింద అయిదారుగురు కలిసి విశ్రమించిన దాఖలాలున్నాయి. ఉంగరాన్ని పోగొట్టుకున్న వాడితో వున్న మిగతావాళ్లు తప్పకుండా చూసిఉంటారు. వాళ్లలో ఎవరికైనా దుర్భుద్ధి పుట్టి ఉంగరం నాదంటే నాదని ఆనవాళ్లు చెబితే న్యాయం జరగదు. నిజంగా వస్తువు పోగొట్టుకున్న వాళ్లకు వస్తువు దక్కదు. దీనిని తమ దగ్గరుంచండి. రేపు ఉపాయం ఆలోచిస్తానని న్యాయాధికారన్నాడు.

ఆ రాత్రి ధర్మపాలుడు తీవ్రంగా ఆలోచించాడు. ఆలోచించగా, ఆలోచించగా ఉపాయం తట్టింది.మరుసటిరోజు అదే ప్రదేశానికి విహారానికి వెడదామని సునందుడ్ని ధర్మపాలుడు ఆహ్వానించాడు. ఇద్దరూ ఆ చెట్టుదగ్గరకు చేరారు. ఉంగరం మీద మట్టి పోసి కనపడి కనపడనట్టుగా చేశాడు.

"ప్రభూ! దీన్ని పోగొట్టుకున్నవాడు తప్పకుండా వెదుక్కుంటూ వస్తాడు. ఇది ఎక్కడపోయింది,పోగొట్టుకున్న వాడికొక్కడికే తెలుసు. వాడు రహస్యంగా ఒంటరిగా వస్తాడు. వచ్చి చుట్టూ పరికించి చూస్తాడు. మట్టిని అటు ఇటు వస్తువు కనపడడానికి చిమ్ముతాడు. అప్పుడు ఇది బయటపడుతుంది. సంతోషంగా తీసుకుంటాడు. న్యాయంగా పోగొట్టుకున్న వాడికే చెందాలంటే ఇంతకన్నా మార్గం లేదని ధర్మపాలుడన్నాడు. పరాయి వాళ్లెవరైనా రేపో, మాపో ఇక్కడ విశ్రమించారనుకో, వాళ్లకు దక్కుతుంది గదా అని సునందుడన్నాడు.పరాయివాళ్లకు ఇక్కడ ఉంగరం పోయిందనే ఆలోచన ఉండదు. ఎందుకంటే వాళ్ల ఉంగరం పోలేదు కనుక.ఆలోచనొస్తే గదా వాళ్లు వెదికేది. వాళ్లకెందుకుంటుంది ఆలోచన అని ధర్మపాలుడన్నాడు. న్యాయం సరిగా జరగదేమో అన్న అభిప్రాయం రాజుగారికున్నా ధర్మపాలుడి ఆలోచన కాదనలేకపోయాడు. నాలుగురోజుల తర్వాత ధర్మపాలుడు, సునందుడు అదే చెట్టుదగ్గరికి విహారానికి వెళ్లారు. ప్రభూ! మీ పరిపాలన న్యాయంగా ఉంది. నేను పోగొట్టుకున్న ఉంగరం తిరిగి దొరికిందని ఉంగరం పోగొట్టుకున్న వాడు దండం పెడితే నిజంగా న్యాయం జరిగిందనిపించింది రాజుగారికి.

దురాశకు పోతే దుఃఖం

ఒకసారి ఒక సాధు పుంగవుడు తన శిష్యులందరి పట్ల సంతుష్టుడై ‘మీకు అమోఘమైన ఒక మంత్రం ఉపదేశిస్తాను. దాన్ని సక్రమంగా ఉపయోగించుకుని జీవితాన్ని సంతోషంగా గడపండి’ అని ఒక మంత్రం ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని చదివి మీకేం కావాలంటే అది కోరుకోండి అది జరుగుతుంది. ఒక్కసారి మాత్రమే. దీన్ని దుర్వినియోగం చేయకండి’‘ అని చెప్పాడు. ఆ శిష్యులలో ఆశారాం అనేవాడు అసంతృప్తితో ‘స్వామీ ఇంతకాలంనుంచి మిమ్ము సేవించుకున్నాను. ఒక్క మంత్రమేనా ఉపదేశించేది?’ రెండింటిని కోరుకునేలా నాకు ఇంకో మంత్రం ఉపదేశించండి’ అని అడిగాడు. అందరు శిష్యులు ఇచ్చినదానితో తృప్తి పడితే వీనికి ఆశ ఎక్కువగా ఉంది అనుకుని ఆ సాధువు ‘అందరికీ సమానంగా మంత్రం ఉపదేశించా, నీకు ఆశ పనికిరాదు, దొరికిన దానితో తృప్తిపడాలి’ అని హితవు చెప్పాడు. కానీ ఆశారాం వినకుండా తనకు ఇంకో మంత్రం ఉపదేశించాల్సిందే అని పట్టుపట్టాడు.

దానికా సాధువు సరేనని కోరుకున్నది జరిగేట్టు ఇంకో మంత్రం ఉపదేశించి పంపాడు. ఇంటికి వెళ్లాక ఆశారాం ‘నా ఇల్లేమిటి ఇలా దరిద్రంగా ఉంది..వట్టి మట్టికొంప, దీన్ని బంగారు ఇల్లుగా మార్చుకుంటే ఎంత బాగుంటుందో’ అనే ఆలోచన వచ్చి సాధువుచెప్పిన మొదటి మంత్రం చదివి ‘నా ఇల్లు బంగారంగాను’ (బంగారు ఇల్లు అవ్వాలని) కోరుకున్నాడు. అతని ఆశ్చర్యానికి అంతులేదు! ఇంట్లో వస్తువులతో సహా ఇల్లంతా బంగారమై మెరిసిపోతోంది. తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. ఇప్పుడు తానెంతో ధనవంతుడనని, తనకెవరూ సాటిరారని గర్వపడ్డాడు...‘ ఇలా బంగారపు ఇంట్లో బంగారు వస్తువులతో జనం మధ్యలో వుంటే అందరి కళ్లూ నామీదే ఉంటాయి. దాంతో దొంగలు దోపిడీదారులు నా ఇంటిపై కనే్నస్తారు..ఇదంతా అపహరించుకోవడానికి’ అనే భయం పట్టుకుంది. ఏం చెయ్యాలా?’ అని ఆలోచిస్తుంటే సాధువుగారు ఉపదేశించిన రెండో మంత్రముందిగా నా దగ్గర అనుకుని ఆ మంత్రం పఠించి ‘నా బంగారం నాకే కాక ఇతరులకు కనపడకుండుగాక’ అని కోరుకున్నాడు. ఇప్పడు ఆ బంగారు ఇల్లు, అందులో వస్తువులు ఆశారాంకు తప్ప ఇతరులకెవ్వరికీ కనపడడంలేదు. చుట్టుపక్కలవాళ్లు గుసగుసలాడుకుంటున్నారు. ఆశ్చర్యపడుతున్నారు. ఆశారాం కనపడుతున్నాడు, కానీ ఇల్లేమైంది. వట్టి ఖాళీ జాగాలో ఉంటున్నాడేమిటో?’అని!

ఒకరోజు ఆశారాం తనవద్దనున్న బంగారంలో కొంత అమ్మాలనుకున్నాడు. రోజువారీ ఖర్చులకోసం డబ్బు కావాలి కదా! కొంత బంగారం పట్టుకుని బంగారం వ్యాపారి దగ్గరకు వెళ్లాడు ఆశారాం. తను కోరుకున్న రెండో వరం..తన బంగారం తనకేగానీ ఇతరుల కంటికి కనపడకుండా వుండాలన్నది మరిచిపోయాడు. వ్యాపారి వద్దకు పోయి ‘ఈ బంగారానికి ధరకట్టి డబ్బులియ్యండి’ అని బంగారం చూపించాడు. ఆ బంగారం తనకే గానీ వాళ్లకు కనపడదు కదా! దానికా వ్యాపారి ‘‘ఏమీ ఇవ్వకుండా బంగారం తీసుకుని డబ్బియ్యమంటావేమిటి? ననే్న మోసం చేద్దామనుకుంటున్నావా?’’ అని కేకలేశాడు. దాంతో ఆశారాం పక్కనున్న వారిని ‘‘చూడండయ్యా, నేను బంగారం ఇస్తుంటే ఏమీ లేదంటున్నాడీయన, ఇదేంటి, ఇది బంగారం కాదా? చూడండి’’ అంటూ చేతిలోని బంగారం చూపిస్తున్నాడు అందరికీ.

ఆ బంగారం అతనికి తప్ప ఎవరికీ కనపడడంలేదు. అందుకని అందరూ ‘‘ పోవయ్యా వట్టి చేతులు చూపిస్తూ బంగారం ఉందంటున్నావు అందరికీ చెవిలో పువ్వులు పెడతావా? ఏది బంగారం! నీకేమన్నా పిచ్చా’’ అని ఆశారాం మాటలు ఎవరూ నమ్మలేదు. పైగా ‘పిచ్చివాడు’ అని అందరూ నవ్వడం మొదలుపెట్టి, పోరా పోరా పిచ్చోడా! అంటూ తన్ని తరిమివేశారు. పాపం! ఆశారాం ఆశపడి ఇంటిని బంగారం చేసుకున్నాడు. కానీ దురాశ అతడిని అన్నింటికీ దూరం చేసి పిచ్చివానిగా ముద్రవేసింది. ఇంటికే కాదు ఊరికీ దూరమయ్యాడు!

చూశారా! తృప్తిలో వున్నంత సుఖం ఎందులోనూ ఉండదు. ఆశ ఉండచ్చు. కానీ తగిన మోతాదులో ఉండాలి . మోతాదు మించి మొత్తానికే మోసం దు:ఖాన్నే మిగుల్చుతుంది.

శత్రువైరం

పూర్వం ఒక పండితుడి ఇంట్లో పాడి ఆవు ఉండేది. ఒక దొంగ కన్ను ఆ ఆవుమీద పడింది. ఎలాగైనా దానిని దొంగలించాలనుకుని ఒక రాత్రి ఆ ఇంటికి వచ్చాడు. అప్పటికే అక్కడ ఒక బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు. దొంగ ఆ రాక్షసునితో ‘‘అయ్యా! నమస్కారం, మీరిక్కడికి ఎందుకు వచ్చినట్లు?’’ అని అడిగాడు.

‘‘ఈ పండితుడిని మింగడానికి. మరి నీవెందుకు వచ్చావు?’’ అడిగాడు బ్రహ్మరాక్షసుడు.
దొంగ, ‘‘ఆవు కోసం’’అని చెప్పి, ‘‘నాకు ఆవు, నీకు పండితుడు కావాలి, కాబట్టి మనం గొడవ పడకుండా ఎవరి పని వాళ్లు చేసుకుందాం’’ అన్నాడు.

‘‘సరే కానీ నేను బ్రాహ్మణుడిని తిని వెళ్ళే వరకు నువ్వు ఓపిక పట్టాలి. ముందుగానే నీవు ఆవు దగ్గరకు వెళ్తే అది నిన్ను చూసి అరుస్తుంది, ఆ అరుపులకు అందరూ మేల్కొంటారు. అప్పుడు నా పని కష్టమవుతుంది. కాబట్టి నా పని ముందు జరగాలి. పైగా నీకన్నా నేను బలవంతుడిని కూడా. కాబట్టి నా నాయకత్వాన్ని నీవు అంగీకరించాలి’’ అన్నాడు రాక్షసుడు.

దొంగ అందుకు ఒప్పుకోలేదు. ‘‘నీవు పట్టుకోగానే పండితుడు అరుపులు, పెడబొబ్బలు పెడతాడు. ఇరుగుపొరుగు పోగైతే నేను ఒట్టి చేతులతో వెళ్ళాల్సి ఉంటుంది. నీవు బలవంతుడివి, పండితుడిని ఎలాగైనా తినగలుగుతావు, నాయకుడు ముందు అనుచరులకు మేలు కలిగేలా చూడాలి, కాబట్టి నేను ఆవును తోలుకెళ్ళే వరకు నీవు ఆగాలి’’ అన్నాడు.

ఇద్దదూ నేనంటే నేను ముందు అని వాదులాడుకుంటూ పెద్దగా అరుచుకున్నారు. దాంతో పండితుడికి మెలకువ వచ్చింది.

దొంగ వెంటనే తాను దొంగతనానికి వచ్చిన సంగతి కూడా మరిచిపోయి, ‘‘ఓయ్! పండితుడా! ఈ రాక్షసుడు నిన్ను తినడానికి వచ్చాడు’’ అని అరిచాడు. రాక్షసుడు కూడా ‘‘వీడు దొంగ, నీ ఆవును దొంగలించడానికి వచ్చాడు’’ అని చెప్పేసాడు.

పండితుడికి విషయం అర్థమైంది. అందరికీ వినబడేలా ‘ఆంజనేయదండకం’ చదవడం ప్రారంభించాడు. ఆంజనేయుడి పేరు వినగానే బ్రహ్మరాక్షసుడు హడలి పారిపోయాడు. ఇంటిల్లిపాదీ, ఇరుగుపొరుగువాళ్ళు లేవడం చూసి దొంగ కూడా కాళ్ళకు బుద్ధి చెప్పాడు.

స్ఫూర్తి

చాలాకాలం క్రితం మగధను విక్రమసేనుడు అనే రాజు పాలించేవాడు. ధైర్యసాహసాలుగల విక్రమసేనుడు తన ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ఆయన రాజ్యంలో ధర్మం నాలుగు పాదాల మీద నడవడమే కాకుండా రాజ్యం కన్నులపండువుగా సంపదలతో తులతూగుతూ ఉండేది.

మగధ ఐశ్వర్యం చూసి ఓర్వలేని పొరుగుదేశం రాజు పెద్ద సైన్యాన్ని వెంటబెట్టుకుని మగధపై దాడి చేశాడు. విక్రమసేనుడి దగ్గర ఎక్కువమంది సైనికులు లేరు. అందువల్ల విక్రమసేనుడు యుద్ధంలో పరాజయం పొందాడు. ప్రాణాలు రక్షించుకునేందుకు అడవిలోకి పారిపోయి, ఒక కొండగుహలో దాక్కున్నాడు.

ఒంటరితనం, పరాజయం, బాధ, అలసట.. అన్నీ ఒక్కసారిగా విక్రమసేనుడిని ఆవరించాయి. ‘‘కన్నబిడ్డల్లాంటి ప్రజలను, రాజ్యాన్నీ కోల్పోయిన నేను ఇక బ్రతకటం అనవసరం. నిస్సహాయుడిగా ఎంతకాలం ఇలా దాక్కోవాలి?’’ అని ఆలోచించిన విక్రమసేనుడు, ‘తనకు చావే శరణ్యం’అనుకున్నాడు. ప్రాణాలు ఎలా తీసుకుంటే బావుంటుందని ఆలోచిస్తున్న సమయంలో అతనికి ఒక దృశ్యం కంటబడింది.

ఒక చిన్న సాలీడు గుహ పైభాగంలో గూడు అల్లుకోవడానికి ప్రయత్నిస్తోంది. సాలీడు పైకి పాకే కొద్దీ దాని నుండి వచ్చే దారం తెగిపోతోంది. దాంతో సాలీడు కిందికి జారిపోతోంది. అయినా సాలీడు తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఎన్నోసార్లు ప్రయత్నించగా చివరికి సాలీడు విజయవంతంగా ఎగబాకి గూడును అల్లటం పూర్తి చేయగలిగింది.

అది చూసిన విక్రమసేనుడిలో కొత్త ఆలోచన కలిగింది. ‘ఒక చిన్న సాలీడు అపజయాన్ని అంగీకరించక మళ్ళీమళ్ళీ ప్రయత్నించి, అనుకున్న పని సాధించగలిగింది. నేను మాత్రం ఎందుకు ప్రయత్నించకూడదు. నేను మనిషిని. అవయవాలతో పాటు భగవంతుడు ఆలోచించడానికి, ఎత్తుకు పై ఎత్తు వేయడానికి అదనంగా మెదడును కూడా ఇచ్చాడు. వైఫల్యం వస్తున్నప్పుడే గెలవడానికి ఒక నిచ్చెన కూడా వస్తుంది.’ ఈ రకమైన ఆలోచన కలిగిన విక్రమసేనుడిలో నిరాశ, నిస్పృహలు పటాపంచలైపోయాయి. కొత్త స్ఫూర్తి కొండంత బలాన్ని చేకూర్చింది.

విక్రమసేనుడు ఆ అడవి నుండి బయటపడి, చెల్లాచెదురైన తన సైన్యాన్ని సమీకరించుకున్నాడు. అనేక పర్యాయాలు విడవకుండా శత్రువుపై దాడి చేసి చివరకు తన రాజ్యాన్ని పొందాడు.

స్నేహంతో వ్యాపారం

అనగనగా ఒక అడవిలో ఒక కొంగ ఉండేది. అది అడవిలో అంగడి తెరిచి పక్షులకు అవసరమైన చిరుధాన్యాలు, చేపలు, పళ్లు, కీటకాలు సేకరించి వ్యాపారం చేసేది. సరసమైన ధరలకే నాణ్యమైన సరుకు అమ్మడంతో చాలా దూరాన ఉండే పక్షులు కూడా కొంగ దగ్గరే ఖరీదు చేసేవి. దాంతో అక్కడికి వచ్చిన పక్షులను ప్రేమతో పలకరించేది కొంగ. అలా వ్యాపారపరంగా చాలా పక్షులు కొంగకు స్నేహితులయ్యాయి. దానికి పేరుతో పాటు డబ్బు కూడా వచ్చింది.

అదే అడవిలో ఓ కాకి ఉండేది. అది కూడా తనకు కావాల్సిన ఆహార పదార్థాలు కొంగ దగ్గరే ఖరీదు చేసేది. కాకికి ఆ అడవి నిండా స్నేహితులే ఉన్నాయి. తను కూడా కొంగలా వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలనుకుంది. కాకికి కొంగ వ్యాపారం చూసి అసూయ కలిగింది. తనకున్న స్నేహితులనే పావులుగా వాడి కొంగ వ్యాపారాన్ని దెబ్బ తీయాలనుకుంది.

కాకి అడవిలో అంగడి తెరుస్తున్నట్టుగా తన స్నేహితులందరికీ చెప్పింది. కొంగ అంగడికి శ్రమపడి చాలా దూరం వెళ్లకుండా అడవిమధ్యలోనే తను కొత్త అంగడి తెరుస్తున్నట్టు ప్రకటించింది. ఇకపై తనవద్దనే సరుకులు ఖరీదు చేయమని కోరింది.

కాకి కొత్తగా తెరిచిన అంగడికి తన స్నేహితులైన కోడిపుంజు, బాతు, చిలక, నెమలి, గద్ద, పావురం...ఇలా పక్షులన్నీ రావడం మొదలుపెట్టాయి. పక్షులన్నీ కాకి దగ్గరే ఖరీదు చేయడంతో కొంగ వ్యాపారం తగ్గిపోయింది.

కోడిపుంజు చేతిలో పెద్ద సంచితో కాకి అంగడికి వచ్చింది.

‘కాకి బావా! కాకిబావా! నాకు కిలో గోధుమలు, కిలో వడ్లు, అరకిలో చేపలు, పావుకిలో పురుగులు కావాలి!’ అంది కోడిపుంజు.
కోడిపుంజు కోరినవన్నీ కాకి కొలిచి ఇచ్చింది. కాకి ప్రతిఫలంగా డబ్బు అడిగింది.

‘ఇస్తాలే కాకిబావా! ఎక్కడికి పోతా!’ అంది కోడిపుంజు. స్నేహం కొద్దీ కాకి సరేనంది.

అది వెళ్లిందో లేదో చేతిలో సంచీతో చిలకమ్మ కాకి అంగడి ముందు వాలింది. చిలకమ్మ రాకకు కాకి సంతోషించింది.

‘‘కాకి బావా! కాకిబావా! నాకు జామపళ్లు, రేగిపళ్లు, పెసరగింజలు కావాలి!’’ అంది చిలకమ్మ.

కాకి అందించింది. కాకి ప్రతిఫలంగా డబ్బు అడిగింది.

‘‘తీసుకుందువులే! మళ్లీ రానా...ఏంటీ!’‘ అంది చిలకమ్మ. స్నేహంకొద్దీ కాకి అలాగేనంది.

అది వెళ్లిందో లేదో చేతిలో సంచితో గద్ద వాలింది. గద్ద రాకకు కాకి పొంగిపోయింది.

‘‘అన్నా! రా అన్నా!’’ అని ప్రేమతో పిలిచింది కాకి.

‘‘కాకి తమ్మి! నాకు చేపలు కావాలి!’’ అంది హుందాగా! కాకి గబగబా సంచీనిండా చేపలు నింపి ఇచ్చింది. కాకి ప్రతిఫలంగా డబ్బు అడిగింది.

‘‘డబ్బులా!సరే, తర్వాత చూద్దాం తమీ!’’ అంటూ సంచీతో రివ్వున పైకెగిరిపోయింది గద్ద.

ఇలా కాకి దగ్గరున్న సరుకు అయిపోయిందే కానీ పైసా తిరిగి రాలేదు. గట్టిగా అడుగుదామంటే స్నేహం అడ్డొచ్చింది. కొద్ది డబ్బుతో అది వ్యాపారం నడపలేక దివాలా తీసింది.

కొంగ వ్యాపారం మీద వున్న అసూయే తనని మింగిందని గ్రహించింది కాకి. అంతేకాదు స్నేహాన్ని వాడుకుని వ్యాపారం చేయలేమని కొంగలా వ్యాపారపరంగా ఏర్పరచుకున్న స్నేహమే గొప్పదని తెలుసుకుంది కాకి.

స్నేహానికి, వ్యాపారానికి ముడిపడదని గ్రహించిన కాకి మరునాడు చేతిలో సంచితో, జేబులో డబ్బుతో కొంగ అంగడివైపు అడుగులేసింది.

సంతోషమైన ముఖం

అనగనగా ఒక ఊరిలో సంతోష్ అనే అబ్బాయి ఉండేవాడు. అతడు ఒకరోజు ఆడుకుంటూ వాళ్ల ఇంట్లో పాత సామాన్లు ఉన్న గదిలోకి వెళ్లాడు. అక్కడ అతనికి ఒక అద్దం కనిపించింది. నగిషీలు చెక్కి ఉన్న చెక్క ఫ్రేమ్‌లో ఆ గుండ్రటి అద్దం సంతోష్‌కి బాగా నచ్చింది. దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి తల్లికి చూపించి, ‘అమ్మా! నేను ఈ అద్దాన్ని తీసుకుంటాను’ అని చెప్పాడు. తల్లి ‘‘సరే నాయనా! కాని జాగ్రత్తగా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇది మన పూర్వీకులది. పాడు చేయకూడదు ’’ అని చెప్పింది. సరేనన్నాడు సంతోష్.

ఆ అద్దాన్ని తీసుకున్న సంతోష్ దాన్ని శుభ్రంగా తుడిచి అందులో ముఖం చూసుకున్నాడు, అతని ముఖం దిగులుగా కనిపించింది. ‘అదేంటి నా ముఖం ఎందుకు దిగులుగా ఉందబ్బా అనుకున్నాడు. తన ఆట వస్తువుల్ని తీసుకుని ఆడుకున్న తర్వాత మళ్లీ అద్దంలో చూసుకున్నాడు. అప్పుడు కూడా ముఖంలో దిగులు కనిపించింది. కాసేపటి తర్వాత తనకి ఇష్టమైన తిండి తిన్నాడు. తిన్న తర్వాత అద్దంలో ముఖం చూసుకున్నా ముందులాగే కనిపించింది.

‘ఛీ! ఈ అద్దంలో ముఖం చూసుకోకూడదు’ అని తనను తను తిట్టుకున్నాడు సంతోష్, ఆ రోజు సాయంత్రం తల్లికి చెప్పి పార్కులో ఆడుకోవటానికి వెళ్లాడు. అక్కడ ఆడుకుంటుండగా సంతోష్‌కి ఒక బాబు ఏడుస్తూ కనిపించాడు, ఆ బాబు పక్కన పెద్దవాళ్లు ఎవరూ లేరు. బాబు తప్పిపోయాడని గ్రహించాడు సంతోష్. తన దగ్గర ఉన్న డబ్బులతో బాబుకి వేరుశనగకాయలు కొని వాటిని ఒలిచి తినిపించాడు. మంచినీళ్లు కూడా తాగించాడు, అప్పుడు ఆ చిన్న బాబు ఏడవటం ఆపాడు. బాబుని ఆడిస్తూ తల్లిదండ్రుల కోసం వెతకసాగాడు. ఈలోగా బాబు తల్లిదండ్రులు కనిపించారు. బాబుని చూసి చాలా సంతోషించారు. బాబుని జాగ్రత్తగా చూసుకున్నందుకు సంతోష్‌ని మెచ్చుకున్నారు.

తమ ఇంటికి ఎప్పుడైనా రావచ్చని ఆహ్వానించారు. ఇంటికి వెళ్లి ఆ విషయాన్ని తల్లికి చెప్పాడు సంతోష్, తల్లి కూడా సంతోషించింది. అప్పుడు అద్దం గుర్తుకు వచ్చి అద్దంలో ముఖం చూసుకున్నాడు. ముఖం అద్దంలో వెలిగిపోతూ కనిపించింది.

ఆలోచనా మేఘం

అనగనగా ఒక అందమైన చిన్న పల్లెటూర్లో కొండ పైన ఒక పెద్ద మేఘం ఉండేది. ‘‘ఈ మేఘం కురవడం వల్లనే కొండ పక్కనున్న చెరువు నిండుతోంది. అక్కడున్న మన పొలాలన్నీ చక్కగా పండుతున్నాయి’’ అని ఆ మేఘాన్ని ఆ ఊరి రైతులు మెచ్చుకునే వాళ్లు.

ఒకసారి ఆ మేఘానికి దాని కన్నా కాస్త పెద్దగా ఉన్న మరో మేఘం కనిపించింది. దానితో అది దిగులు పడింది. ‘‘నేను దాని కన్నా పెద్దగా ఉండాలి. లేకపోతే నన్నెవరూ మెచ్చుకోరు’’ అనుకుంది.

‘‘నేను కురిస్తే దాని కన్నా చిన్నగా అయిపోతానేమో’’ అనుకొని వర్షించకుండా ఉండడం మొదలు పెట్టింది. అయితే ఆ మేఘం ఆశించినట్లుగా అది చూసిన మరో మేఘం కన్నా పెద్దగా కాలేదు.

కొండ దగ్గర వర్షం కురవక పోవడంతో చెరువులో నీళ్లు తగ్గిపోయాయి. పొలాల్లో సరిగా పంటలు పండడంలేదు. ప్రజలు చాలా ఇబ్బందులు పడసాగారు. వర్షం కురవడం లేదని మేఘాన్ని తిట్టడం మొదలు పెట్టారు. కొన్నిరోజులకి నెమ్మదిగా చెరువు కూడా ఎండిపోయింది. దానితో మేఘానికి కావాల్సిన నీటి ఆవిరి అందక అది గతంలో కన్నా చిన్నగా, తేలికగా అయిపోయింది.

గాలివాటుకి పక్క ఊరి వైపు కొట్టుకు పొయింది. అక్కడ చెరువుల నిండా నీళ్లు ఉండడంతో మేఘానికి కావాల్సిన నీటి ఆవిరి దొరికింది. తిరిగి తనుండే కొండ వైపు వచ్చింది. దానితో అక్కడ గతంలోలాగా వర్షాలు కురిసాయి. ప్రజల ఇబ్బందులు తగ్గాయి.

అప్పుడు ఆ మేఘానికి తాను అంతకు ముందు చేసిన తప్పు ఏమిటో అర్ధమయింది. ఆకారం పెద్దదా, చిన్నదా అనేది ముఖ్యం కాదని అనుకుంది. వర్షాలు కురిస్తేనే తనకీ, ప్రజలకీ మనుగడ ఉంటుందనీ, లేకపోతే ప్రజలతో పాటుగా తనకీ కష్టాలు తప్పవనీ గ్ర హించింది. అప్పటి నుంచి తన ఆకారం గురించి పట్టించుకోకుండా తను చేయాల్సిన పని మీదే శ్రద్ధ పెట్టింది. దానితో మేఘంతో పాటు ఆ ఊరి ప్రజలు కూడా సంతోషంగా ఉండసాగారు.

దేశాటన

కళింగ రాజ్యాన్ని పాలించే గుణశేఖరుడికి ఒక్కడే కొడుకు. అతని పేరు రాజశేఖరుడు. యుక్త వయసు వచ్చేసరికి అతను అన్ని విద్యలలోనూ ఆరితేరాడు. అతని జ్ఞానం పరిపూర్ణమయిందని గురువులు ఒప్పుకున్నారు. ఆ జ్ఞానానికి తగిన అనుభవం కూడా ఉంటే తన కొడుకు రాణించగలడనే ఉద్దేశ్యంతో గుణశేఖరుడు తన కొడుకును దేశాటన చేసి రమ్మన్నాడు. తండ్రి మాట ప్రకారం రాజశేఖరుడు తూర్పుదిక్కు ప్రయాణమై వెళ్లాడు. ఒక రోజు చీకటి పడే వేళకు అరణ్య ప్రాంతంలోకి వచ్చాడు. అక్కడ అతనికి ఒక మూలుగు వినిపించింది. భూగర్భంలోకి ఎగుడు దిగుడుగా మెట్లు ఉండటం చూశాడు. వాటి వెంబడి దిగిపోతే ఒక పాతాళ భైరవి విగ్రహం దానికి ఎదురుగా స్తంభానికి కట్టి ఉన్న సుందరి కనిపించారు. ఎవరు నువ్వు? నిన్నిక్కడ ఎవరు కట్టేశారు? అని రాజశేఖరుడు సుందరిని అడిగాడు. తనను ఒక మాంత్రికుడు బలి ఇవ్వబోతున్నట్లు ఆమె తెలిపింది. కొంత సేపటికి మాంత్రికుడు వచ్చి విగ్రహం ముందు కూర్చొని కళ్ళుమూసుకొని మంత్రాలు చదవటం ప్రారంభించాడు. ఇదే అదునుగా రాజశేఖరుడు వాడి తల నరికేశాడు. రాకుమారిని ఆమె తండ్రి అయిన మాళవరాజుకు అప్పగించాడు. ఆయన రాజశేఖరునికి కృతజ్ఞతలు తెలుపుకొని తన కూతురును అతనికి ఇచ్చి వివాహం చేశాడు. రాజశేఖరుడు భార్యను తీసుకొని తండ్రి దగ్గరకు వచ్చి జరిగినదంతా చెప్పాడు.

నీ దేశాటనతో నేను అంతగా తృప్తి పడలేదు. మరోసారి నువ్వు దేశాటన చేసిరా అన్నాడు తండ్రి. ఈసారి అతను పడమట దిశగా బయలుదేరాడు. ఆ ప్రయాణంలో రాజశేఖరుడికి బీటలుబారిన పొలాలు, ఎముకలగూళ్లలా ఉన్న మనుషులు కనిపించారు. గుంపులు గుంపులుగా వలస పోతున్న జనం అతనికి ఎదురై తమ దేశంలో క్షామం తాండవిస్తున్నదని దానికితోడు కర్కోటకుడైన రాజు తమను పన్నులతో వేధిస్తున్నాడని చెప్పారు. మరో గ్రామంలో సైనికులు రైతులను పన్ను కట్టలేదని హింసిం చడం కళ్లారా చూశాడు. అతనికి పట్టరాని కోపం వచ్చింది. ఆ దేశపు రాజును కలుసుకొని అతని పాలనను తిట్టిపోశాడు. ఆ రాజు రాశేఖరుడిని బంధించాడు. ఈ వార్త చారుల ద్వారా గుణశేఖరుడికి తెలిసింది. వెంటనే ఆయన పెద్ద సేనను వెంటబెట్టుకుని వచ్చి ఆ రాజును సంహరించి ఆ దేశంలోనూ పరిపాలన ఏర్పాటు చేశాడు.రాజశేఖరుడి రెండో దేశాటన గుణశేఖరుడికి తృప్తి కలిగించింది. బేతాళుడు ఈ కథ చెప్పి రాజా! నాకొక సందేహం.

గుణశేఖరుడు తన కొడుకు చేసిన మొదటి దేశాటన పట్ల ఎందుకు తృప్తి చెందలేదు? కుమారునికి అష్టకష్టాలను తెచ్చిపెట్టిన రెండో దేశాటన ఎందుకు తృప్తి కలిగించింది? అని అడిగాడు. దీనికి సమాధానంగా విక్రమార్కుడు ఇలా బదులిచ్చాడు. రాజు తన కొడుకును దేశాటనకు పంపింది సుఖప్రయాణానికి, భార్యని సంపాదించుకోడానికి కాదు. రాజు కావడానికి కావలసిన వాస్తవ అనుభవం సంపాదించుకోడానికి. రెండో దేశాటనలో అతనికి కలిగిన అనుభవం విలువ గలది. అతను ప్రజల బాధలను చూడటమే. వాటి పట్ల మంచి పాలకుడు ప్రదర్శించవలసిన వైఖరి ప్రదర్శించాడు. అందుకే అతని తండ్రికి ఆ దేశాటన తృప్తి కలిగించింది.

తెగించిన జంతువులు

అది నల్లమల అటవీ ప్రాంతం. జంతువులన్నీ ఓ అత్యవసర విషయం గురించి సమావేశం అయ్యాయి. ప్రతి జంతువు ముఖంలో ఆందోళన ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ముందుగా సింహరాజు లేచి 'జంతు ప్రజలారా! మనుషులు మన నివాసమైన అటవీ ప్రాంతాన్ని నిర్ధాక్షిణ్యంగా నరుకుతున్నారు. కలప దొంగలు, స్థలాల వ్యాపారులు తమ వ్యాపారాల గురించి ఇలా నరుక్కుంటూ పోతే మన గతి ఏమిటి? మనం ఎక్కడికి పోతాము? ఇప్పటికే మన జంతువులు అనేక రకాలు అంతరించిపోయాయి. కొన్ని తరలిపోయాయి. ఇప్పుడు మనం ఎటువంటి భేధభావము లేకుండా భేటీ అయ్యాము. ఎవరికి తోచిన సలహాలు వారు ఇవ్వండి అంది. దానికి నక్క 'ప్రభూ! ప్రాణాలు మీదకు వచ్చినప్పుడు ఎలాంటి మార్గమైనా అవలంభించవచ్చు అని నీతిశాస్త్రంలోనే ఉంది. మన జీవనానికి అడ్డు అవుతున్న వారితో పోరాటమే ఇప్పుడు మన ముందు ఉన్న ఉపాయము.

భగవంతుడు మనకు ఇచ్చిన శక్తి మనకూ ఇచ్చాడు. మన డేగకళ్ళు వారి బైనాక్యు లర్స్‌ కన్నా శక్తివంతమైనవి, మన గబ్బిలాన్ని చూసే వారు రాడార్‌ యంత్రాన్ని కనిపెట్టారు. మన కుక్కలు మనిషి వాసనను చాలా దూరం నుంచే పసిగట్టకలవు. మన కందిరీగలు తలచుకొంటే ఎంత పెద్ద సైన్యాన్ని కూడా చుట్టు ముసిరి చంపగలవు. మనలోని కొన్ని జంతువులు ఆహారం, నీరు లేకుండా చాలా కాలం బ్రతకగలవు. అలాగే మన ఏనుగులు, త్రాచులు, ఒంటెలు అన్నీ గండర గండలే. ముందు కలప స్మగ్లర్స్‌ పని పడదాము అంది. తరువాత ఏనుగు లేచి తరువాత జనారణ్యంపై పడదాము. మా ఏనుగుల మందలు ఊళ్ళు అన్నింటిని నాశనం చేస్తాము అంది. పులిలేచి మన సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం చేస్తాము. దుర్మార్గ జనాలను చీల్చివేస్తాము అంది ఆగ్రహంగా. ఇలా ప్రతి జంతువు పోరాటానికి సిద్దం అయ్యాయి. సింహరాజు మిత్రులారా ఒక లక్ష్యం గురించి కలిసి పోరాటం చేస్తే సాధించలేనిది ఏమీ లేదు. ధైర్యంతో అడుగు ముందుకు వేస్తే త్రోవ అదే కన్పిస్తుంది. ప్రజల్లో కూడా చాలా మంది మంచివారు ఉన్నారు.ప్రభుత్వాలు కూడా మన సంక్షేమం గురించే ఆలోచిస్తున్నది. జీవకారుణ్య సంఘాలు మనవైపు ఉండనే ఉన్నాయి అంది.

సింహ రాజు మాటకు జంతువు లన్నీ సంఘీభావం చెప్పి ఆమె ఉనికి గురించి పోరాటము మొదలు పెట్టాయి. ముందుగా అడవిలోకి వచ్చిన కలప దొంగలను కడతేర్చాయి. తరువాత ఏనుగులు మందలు మందలుగా పోయి గ్రామాలను ధ్వం సం చెయ్య సాగాయి. నక్క లాంటి మేధావి వర్గం ఊళ్ళల్లోకి పోయి అక్కడ ఉన్న ఎద్దు, ఆవు, గుర్రం, గాడిద లాంటి పెంపుడు జంతువులకు కూడా తమ సిద్ధాంతం నూరిపోసి పోరాటానికి సిద్దం చేశాయి. జంతు లోకం తిరగబడింది. మానవ లోకం గడగడలాడింది. నక్కలు రాత్రివేళల్లో మందలు, మందలుగా గ్రామాలకు పోయి అక్కడ పెంపుడు జంతువులను సమావేశపరచి మిత్రులారా! మనిషి స్వార్థపరుడు తాను సంతోషంగా ఉండటానికి ఎంతకు అయినా తెగిస్తాడు. సర్వజంతు ప్రపంచం నాశనం అయిపోయినా ఫర్వాలేదు. చెట్లు లేక ఆరణ్యం వేడెక్కి గూడు లేక, దారి లేక మనం మలమల మాడిపోయినా ఫర్వాలేదు. ఎద్దును పెంచుతున్నది తన వ్యవసాయం కోసం అంతే కాని ప్రేమతో కాదు. ఎద్దు ముసిలి అయిపోతే ఇన్నాళ్ళ సేవను మరిచి కటింగ్‌కి అమ్ముతారు. ఆవుని పెంచేది పాల కోసము, గొర్రెను ముద్దుగా బలిపించేది దాని మాంసం కోసం, కోళ్ళను పెంచేది గుడ కోసం, పిల్లిని పెంచేది ఎలకల కోసము, గుర్రాన్ని పెంచేది సరుకుల రవాణా కోసము, ఇలా ప్రతి పెంపుడు జంతువును తన స్వార్థం కోసం బంధించి పెంచుతున్నాడు. అవసరం తీరగానే చంపుతున్నారు అని నక్కలు ఆ విధంగా బోధించేసరికి పెంపుడు జంతువులు కూడా అడవి జంతువులతో కలిసి పోరాటము చెయ్యటానికి నిశ్చయించుకున్నాయి. తెల్లవారి తమ వద్దకు వచ్చిన యజమానులపై తిరగబడ్డాయి. వారు బిత్తరపోయి తమ కర్రలు వదిలి పారిపోసాగారు.

జంతువులు పగలబడి నవ్వాయి. ఎద్దులు, పోతులు గాడిదలు మొదలగు జంతువులు తిరగబడేసరికి వీధుల్లోంచి జనాలు అడవులువైపు పారిపోసాగారు. అడవివైపు వచ్చినవారిని ఏనుగులు తరమసాగాయి. ఆహారం, పాలు, గ్రుడ్లు, ధాన్యం దొరక్క జనాలు మలమలమాడ సాగారు. సాధు జంతువు ఆవు వద్దకు పోయినా మహంకాళిలా చూస్తోంది. మన పని అయిపోయింది కలికాలం అనుకోసాగారు ప్రజలు.

ప్రభుత్వం పెద్ద మిలట్రీని దించింది. జంతువులను క్రూరంగా తుపాకులతో చంపసాగారు. దాంతో జీవకా రుణ్య సంఘాలవారు జంతు శ్రామికులు జంతువులు తరపున పెద్ద ఉద్యమం లేవదీశారు. అక్కడ మేధావులు సమావేశమై ఈ ప్రపంచాన్ని భగవంతుడు అన్ని జీవరాశుల గురించి పుట్టించారు. ఒక్క మనుషుల గురించే కాదు. వాటి నివాసాలను మనం కబళిస్తే అవి మన నివాసాలపై పడతాయి. చెట్లు నరికితే జంతువులతో పాటూ మనమూ పోతాము. భూగోళం నాశనం అవుతుంది. కనుక ఎవరి చోటవారు ఉందాము. చెట్లను పెంచుదాం, జీవరాశుల ఎడల ప్రేమ కలిగి ఉందాం అని నిశ్చయించుకొన్నారు.

మంత్రపు విత్తులు

అనగనగా ఒక ఊరిలో ఒక పేదరాలు ఉండేది. ఆమెకు రాజు అనే ఓ కొడుకు ఉండేవాడు. ఇద్దరూ కలిసి ఒక ఆవ్ఞను పెంచుకుంటూ, ఓ పూరి గుడిసెలో ఉండేవారు. ఆవ్ఞపాలు అమ్ముకుంటూ, ఆ వచ్చిన డబ్బుతో బతికేవారు. ఈ ప్రపంచంలో ఏదైనా ఎప్పుడూ ఒకేలా ఉండదుగా. కొంత కాలానికి రాజు వాళ్ల ఆవ్ఞ ముసలిదైపోయింది. ఇదివరకులా పాలను ఇవ్వడం మానేసింది. దాంతో ఎలా బతకాలా అని రాజు, అతని తల్లి బెంగపడసాగారు. ఒకనాడు రాజుకి ఓ చక్కటి ఆలోచన వచ్చింది. ఈ ఆవ్ఞని అమ్మేసి, ఆ వచ్చిన డబ్బుతో మనం ఏదైనా ఒక చిన్న వ్యాపారాన్ని మొదలుపెడితే ఎలా ఉంటుందమ్మా? అని తల్లిని అడిగాడు. ఆమె సరేనంది. ఇంకేం ఆవ్ఞని తీసుకుని రాజు సంతకు వెళ్లాడు. అయితే అతను ఎంతసేపు ఉన్నాగానీ ఎవరూ ఆ ఆవ్ఞని కొనుక్కోలేదు. సాయంత్రం అయింది. ఇంకొంచెం సేపటిలో చీకటిపడుతుంది. ఇంతలో ఓ ముసలతను రాజు దగ్గరికి వచ్చి, ఇదిగో అబ్బా§్‌ు ఈ ఐదు గింజల్ని తీసుకుని నీ ఆవ్ఞని నాకిస్తావా? అని అడిగాడు. రాజు అయోమయంగా చూశాడు. ఇవి మామూలు గింజలు కాదులే. మంత్రపు విత్తులు. ఇవి నీకు బాగా పనికొస్తాయి అన్నాడు ముసలతను. రాజుకి నమ్మకం కలిగింది. ఆ గింజల్ని తీసుకుని ఆవ్ఞని అతనికిచ్చేశాడు.

ఇంటికి వచ్చాక రాజుని వాళ్ల అమ్మ బాగా తిట్టింది. ఇంత తెలివి తక్కువ పని చేశావేంట్రా, అంటూ గింజల్ని విసిరికొట్టింది. ఆ తరువాత రాజు ఆ గింజల కోసం వెతికితే అందులో ఒక్కటి మాత్రం దొరికింది. వెంటనే దాన్ని నేలలో పాతి కొంచెంనీళ్లు పోశాడు. ఆశ్చర్యం! మరుసటిరోజు తెల్లారేసరికి అక్కడో పెద్ద చెట్టు కనిపించింది. చాలా పెద్ద చెట్టు. రజుకి చెట్లేక్కడం బాగా వచ్చు. అందుకని చకచకా ఆ చెట్టుపైకి ఎక్కాడు. దాని చిటుకొమ్మలు మబ్బుల్ని తాకుతన్నాయి. అక్కడ ఓ పెద్ద కోట. అందులో ఓ అందమైన భవనం ఉన్నాయి. రాజు ఆ భవనంలోకి దూరి అన్ని గదులూ తిరగడం మొదలుపెట్టాడు. ఇంతలో ఉన్నట్టుండి ఒక దేవత ప్రత్యక్షమయింది. ఒరే§్‌ు అబ్బా§్‌ు నువ్ఞ్వ భలే ధైర్యవంతుడివిరా. అందుకే నీకో సాయం చేయాలనుకుంటున్నాను. నేను చెప్పినట్టు చేస్తే నీకు బోలెడంత బంగారం దొరుకుతుంది అంటూ రాజుకి ఓ రహస్యం చెప్పింది.

దేవత చెప్పినట్లుగానే కొంత సేపటికి అక్కడికి ఒక రాక్షసుడు వచ్చాడు. వచ్చీ రాగానే వాడు పీకనిండా తిని, మంచంమీదికి చేరుకున్నాడు. క్షణంలో నిద్రలోకి జారుకున్నాడు.

అప్పటిదాకా గదిలో దాక్కుని ఉన్న రాజు మెల్లగా బయటికి వచ్చి రాక్షసుడి మంచం కిందికి దూరాడు. అక్కడ ఓ బండరాయి కనిపించింది. రాజు దానిని మెల్లగా పక్కకు జరిపాడు. దానికింద ఉన్న గొయ్యిలో ఒక పెద్ద బంగారు నగల మూట ఉంది. రాజు ఆ నగల మూటను తీసుకుని మెల్లగా మంచం బయటకు వచ్చాడు. ఆ తరువాత చకచకా నడుచుకంటూ భవనం బయటకు వచ్చి తన ఇంటికి బయలుదేరాడు. ఆశ్చర్యం రాజు ఇలా దిగాడో లేదో ఆ చెట్టు టక్కున మాయమైపోయింది. రాజు తెచ్చిన ధనంతో అతను, అతని తల్లి ఎంతో హాయిగా జీవించారు.

అసూయ

ఒక పిచ్చుక ఒక తోటలో నున్న ఒక పెద్ద మర్రిచెట్టు కొమ్మకు గూడును అల్లుకొని తన ఇద్దరి పిల్లలతో హాయిగా నివసించసాగింది. ఆ చెట్టుకు సవిూపంలోనే మరొక చెట్టుమీద గూడును నిర్మించుకొని తన ఇద్దరి పిల్లలతో నివసించసాగింది కాకి. ఒకరోజు కాకి, పిచ్చుక దగ్గరకు వెళ్ళి మిత్రమా! నాకు ఒక సహాయం చెయ్యాలి. నా గూడును పుల్లలతో నిర్మించుకోవడం వల్ల చిన్నపాటి వర్షానికి తడిసిపోవడం, కొద్దిపాటి గాలికే చెదిరిపోవడం జరుగుతోంది. నీవ్ఞ అల్లిన గూడు వర్షానికి, గాలికి ఏమాత్రం చెక్కు చెదరకుండా వ్ఞంటోంది. కాబట్టి నువ్ఞ్వ గూడును ఎలా అల్లుకుంటావో నాకూ నేర్పవా? అంది. మిత్రమా! నీ ఆలోచన బాగానే వ్ఞంది. నాకులా నీవ్ఞ నా గూడును అల్లటం అసాధ్యమైన పని. నీకు నేర్పాలన్నా నీవ్ఞ నేర్చుకోలేవ్ఞ. అంతగా కావాలంటే నా గూడులాంటిదే మరొక గూడును అల్లిస్తా అంది పిచ్చుక.

పిచ్చుక సమాధానం తన వ్యక్తిత్వానికి భంగం కలిగించినట్లుగా భావించి కాకి, క్రమంగా పిచ్చుక దాని పిల్లలపై అసూయ పెంచుకోసాగింది. కాకి అలా మొదలైన అసూయ పిచ్చుక, దాని పిల్లల్ని చంపివేయాలనే నిర్ణయందాకా వచ్చింది. కాకి ఒకరోజు పిచ్చుక దగ్గరకు వెళ్ళి మిత్రమా! ఇక్కడినుండి దక్షిణ దిక్కుకు రెండు కోసుల దూరంలో ఒక గుడి వ్ఞంది. ఆ గుడిపై చదునుగా వ్ఞన్నచోట చాలా వడ్ల గింజలున్నాయి. నీవ్ఞ అంతదూరం వెళ్లి తెచ్చుకోగలిగితే నీకూ, నీ పిల్లలకు ఆహారకొరతే వ్ఞండదు అంది. ఓహో అలానా మిత్రమా! చాలా కృతజ్ఞతలు అని పైకి అంటూనే ఏదో పన్నాగం పన్ని వ్ఞంటుందని లోలోపల ఆలోచింపసాగింది పిచ్చుక.

కాకి మనస్తత్వం వూహించుకుని ఎందుకైనా మంచిదని తలచి అక్కడికి కొంచెం దూరంలో వ్ఞన్న మరొకచెట్టు కొమ్మకు గూడును అల్లి తన ఇద్దరి పిల్లల్ని వ్ఞంచి వాటికి తగిన జాగ్రత్తలు చెప్పి, కాకి దగ్గరకు వెళ్ళింది పిచ్చుక. మిత్రమా! నేను ఆహారం కోసం బయలుదేరుతున్నాను కాస్త మా పిల్లల్ని కనిపెట్టుకుని వ్ఞండు. నేను కనపడలేదని ఒక్కోసారి ఎగిరిపోతుంటాయి అంది పిచ్చుక. ఓ అలానే మిత్రమా! నీవ్ఞ ఏవిూ భయపడవద్దు. నేను చూసుకుంటాలే నీవ్ఞ నిశ్చింతగా వెళ్ళిరా అంది కాకి. కొద్దిసేపటికి కాకి సవిూప పిచ్చుక గూడు దగ్గరకు వెళ్లి పిల్లలు లేకపోవడం చూసి తన పిల్లల్ని అందులో నిద్రపుచ్చి పిచ్చుక పిల్లల్ని చంపటంకోసం వాటిని వెతకసాగింది. ఇంతలో అటుగా వెళుతున్న వేటగానికి పిచ్చుక కనపడింది. ఆహా ఎన్నిరోజులకు పిచ్చుక మాసం తినిబోతున్నానని భావించి నిదానంగా చెట్టు ఎక్కి గూడును తీసుకుని చూస్తే కాకి పిల్లలు కనిపించాయి. పిచ్చుక పిల్లలు అని అనుకుంటే ఇవ్ఞన్నాయే అనే కోపంతో వాటిని తీసి నేలకు బాదాడు. అవి గిలగిల కొట్టుకొని చచ్చిపోయాయి.

తరువాత వచ్చిన కాకి తన పిల్లలు చనిపోయి ఉండటాన్ని చూసి బోరున విలపించసాగింది. గింజలు కనపడక అలసిపోయి తిరిగి వస్తున్న పిచ్చుకకు,అయ్యా ''కాకులు కూడా పిచ్చుక గూళ్ళు అల్లుతాయా? ఇయాల నేను పిచ్చుక గూడును చూస్తే అందులో కాకి పిల్లలుండాయి అందుకని వాటిని అక్కడే సంపేసా అని మాటలు వినబడ్డాయి. పిచ్చుకకు విషయం అర్థమైంది. హడావ్ఞడిగా తన గూడు దగ్గరకు వెళ్ళి తన పిల్లలు క్షేమమేమని తెలుసుకుని పాత గూడువ్ఞన్న చోటకు వెళ్ళింది పిచ్చుక. కాకి పిచ్చుకను కౌగలించుకొని విలపిస్తూ క్షమించు మిత్రమా! అసూయతో నీ బిడ్డల్ని చంపాలని చూశాను. కాని నా అసూయ నా బిడ్డల్నే హతమార్చింది. బిడ్డలులేని నాకు చావే శరణ్యం అంటూ తలను నేలకు బాదుకోసాగింది కాకి. విధిరాత తప్పదు మిత్రమా! బిడ్డల్ని కోల్పోయినంత మాత్రాన ప్రాణం తీసుకోవడం భావ్యమా. నా బిడ్డలు క్షేమంగా వ్ఞన్నారు. నీకు అభ్యంతరం లేకపోతే మాతో వ్ఞండవచ్చు అంది పిచ్చుక. నాటినుండి అన్ని అవలక్షణాల్ని వీడి పిచ్చుక దాని పిల్లలతో హాయిగా కాలం గడుపసాగింది కాకి. వాటి స్నేహానికి మిగతా పక్షులన్నీ ఆశ్చర్యంలో మునిగిపోసాగాయి.

కీడు తెచ్చిన కోరిక

ఒక అడవిలో 'బబ్లూ అనే ఒక ఎలుగుబంటి ఉండేది. అది చూడడానికి చాలా నల్లగా, పొట్టిగా, బలంగా, భయంకరంగా ఉండేది. దానిని చూసి మిగిలిన జంతువ్ఞలు భయపడేవి. కానీ నిజానికి బబ్లూ చాలా మంచిది. అందరికీ సహాయం చేసే గుణం కలది. ఆ కారణంగా ఎలుగును ఆ అడవిలో గల జంతువ్ఞలు తమ నాయకునిగా భావించేవి.
బబ్లూ తన సలహాదారునిగా 'బన్నీ అనే నక్కను తన దగ్గర నియమించుకుంది. బన్నీ మహా మేథావి. ఎంతో నమ్మకమైంది కూడాను. అందుకే బబ్లూకు బన్నీ అంటే చాలా ఇష్టం. బన్నీ తక్కిన నక్కల్లా కాకుండా తమ నాయకునిపై చాలా విశ్వాసాన్ని చూపేది. ఏ తగాదా వచ్చినా బన్నీ సలహా ప్రకారమే బబ్లూ తీర్పు చెప్పేది. తన తీర్పుకు అన్ని జంతువ్ఞలు కట్టుబడి ఉండేవి. బబ్లూను, బన్నీని ఆ అడవిలో నున్న చాలా జంతువ్ఞలు ఎంతో ప్రేమగా, అభిమానంగా చూసేవి.

బబ్లూ పెత్తనం, బన్నీ సలహాలు ఆ అడవిలో ఉండే 'సిఖిముఖి అనే తోడేలుకు, దాని స్నేహితులకు నచ్చేవి కాదు. సిఖిముఖి తన స్నేహితులు త్రోవనపోయే అమాయక జంతువ్ఞలను అల్లరి చేసేవి. అందుకు శిక్షగా రోజంతా అడవి చుట్టూ తిరగాలని బబ్లూ ఆ తోడేళ్ళను శాసించేది. ఆ కారణంగా బబ్లూ అంటే వాటికి పడేది కాదు. బబ్లూను నాయకత్వ స్థానంనుండి ఎలాగైనా తొలగించాలనుకొనేవి. దానికి ఏం చేయాలో సిఖిముఖి దాని స్నేహితులకు అర్థం కాలేదు.

బబ్లూ దగ్గర ఉన్న బన్నీ చాలా తెలివైనది. జిత్తులమారిది. మనకు తట్టని ఆలోచనలు దానికి తడతాయి. అంచేత దానిని లేపుకొచ్చి చితకబాదితే అదే సరైన సలహా ఇస్తుంది అని సిఖిముఖి దాని స్నేహితులతో అంది. అందులో ఒక తోడేలు లేచి కొట్టడం తిట్టడం చేస్తే ఎవరైనా సలహాలిస్తారా? బన్నీకి సకల మర్యాదలు చేసి మన పథకానికి సలహా అడుగుదాం. ఇంకా మన దారికి రాలేదనుకో అప్పుడు రెండు తగిలిద్దాం. ఎలాగుంది మన ఆలోచన! అంది. పథకం ప్రకారం బన్నీని ఎత్తుకు వచ్చాయి.

సకల మర్యాదలు చేసి వారికి కావలసిన సలహాను అడిగాయి. తను ప్రమాదకర పరిస్థితులలో చిక్కుకున్నానని బన్నీ గ్రహించింది. తోడేళ్ళ ముఠాను దెబ్బ తీయాలనుకుంది. బబ్లూ మీద ఉన్నవీ లేనివీ కల్పించి వారికి చెప్పింది. బబ్లూను నాయకునిగా తొలగించి సిఖిముఖిని నాయకుని చేయడం తనకెంతో ఇష్టమని చెప్పింది. అన్ని జంతువ్ఞల కంటే బబ్లూ నల్లగా ఉండబట్టే భయంకరంగా కనిపిస్తున్నాడనీ, ఆ కారణంగానే అందరూ తన పెద్దరికానికి తలొగ్గుతున్నారని చెప్పింది. సిఖిముఖి నల్ల రంగు శరీరానికి పులుముకుంటే బబ్లూ కంటే భయంకరంగా తయారవ్వవచ్చనీ తోడేళ్ళు, నక్కలు ఒక్కటై బబ్లూను తరిమేయవచ్చని బన్నీ తెలివితేటలుగా సలహాఇచ్చింది. సిఖిముఖి దాని మిత్రులు బన్నీ మాటలు పూర్తిగా నమ్మేసాయి. సిఖిముఖి ఆతృతగా బన్నీనుద్దేశించి నల్లరంగు ఎక్కడ దొరుకుతుంది అని అడిగింది.

బన్నీ ఒక్క క్షణం ఆలోచిస్తూ వీళ్ళ పీడ ఎలాగైనా విరగ్గొట్టుకోవాలి? బబ్లూను ఎలా కాపాడుకోవాలి? అనే ఆలోచనలో పడింది. బన్నీ ఉన్నట్టుండి ఆ మధ్య మన అటవీ మార్గం గుండా కొత్తగా తారు రోడ్డు వేయడాన్ని చూసాను. ఆ తారు చాలా నల్లగా ఉంటుంది. అక్కడ చాలా తారుంది. దానిని మీ శరీరాలకు పూసుకుంటే మిమ్మల్ని ఎవరూ పోల్చుకోలేరు. అప్పుడు ఈ అడవికి కొత్తగా వచ్చిన భయంకరమైన జంతువ్ఞల్లా కనిపిస్తారు అని చెబుతుంది. కొద్ది క్షణాలలో సిఖిముఖి తన స్నేహితులతో కలిసి తారు డబ్బాలున్న ప్రదేశానికి పరుగు పరుగున వెళ్ళి పోటాపోటీగా తారు డబ్బాల్లో గెంతేసాయి. ఆ డబ్బాలలో మునిగి వాటి నుండి బయటకు రాలేక గిల గిల కొట్టుకుంటూ చచ్చాయి. జరిగిన సంఘటనను అడవిలో నున్న జంతువ్ఞలకు తెలిసి దుర్మార్గులకు తగిన శాస్తి జరిగిందని సంతోషించాయి.

సందేహం

అనగనగా ఒక రోజు ఒక బడిలొ బాలుడికి ఒక సందేహం వచ్చింది. అతని గురువుని వెళ్ళి అడిగాడు – “గురువుగారు, యెక్కువ మాట్లాడితే మంచిదా, తక్కువ మాట్లాడితే మంచిదా?”

గురువుగారు చిరునవ్వుతొ ఈ జవాబు చెప్పారు. “కప్పకూత రాత్రి-పగలు వినిపిస్తూనే వుంటుంది, అయినా దాన్ని యెవ్వరూ పట్టించుకోరు. కాని కోడి ఒక్కే ఒక్క సారి కూస్తే ఊరంతా నిద్ర లేస్తుంది. దీని వల్ల అర్ధమయ్యేది యేమిటంటే, యెక్కువ మాట్లాడి ప్రయోజనం లేదు. మాట్లాడేది ఒక మాటే అయినా, అది సరైన సమయంలో మాట్లాడితే అందరూ వింటారు.”

సందేహం తీరిన కుర్రవాదు సంతోషంగా వెళ్ళాడు.

చాణక్యుని గ్యానోదయం

చాలా సంవత్సరాల క్రితం తక్షిల అనే ఊరిలో చాణక్య అనబడే బ్రాహ్మడు ఉండేవాడు. అతను మౌర్యుల సామ్రాజ్యాన్ని స్థాపించిన మహోన్నతుడు. ఈ సామ్రాజ్యం స్థాపించడానికి అతను చాల కృషి చేసాడు. చాలా రాజ్యాలతో యుద్ధం చేసి, చంద్రగుప్తుడిని రాజు చేసాడు.
ఒక రోజు చంద్రగుప్తుడితో పాట్లిపుత్ర నగరం మీద దండి చేసి ఓడిపోయిన చాణక్యుడు నిరాశగా ఇంటికి బయలుద్యారాడు. దారి లో అలసటనిపించి ఒక ఇంటి అరుగు మీద కూర్చున్నాడు. ఇంట్లో ఒక అవ్వ తన పిల్లలికి అన్నం పెడుతోంది. తింటున్న పిల్లల్లో ఒకడు హటాత్తుగా కెవ్వని కేక పెట్టాడు. హడిలిపొయిన అవ్వ “యేమైంది బాబు!” అంటే ఆ బాలుడు “అన్నం వేడిగా వుంది, చేయి కాలిందమ్మ” అన్నాడు.

“అదే మరి, నువ్వూ చాణక్యుడిలానే వున్నావు,” అంది అవ్వ. “యెవరైన అన్నం మధ్యలో చేయి పెడతార? పక్కలనుంచి చిన్నగా తింటూ రవాలికాని?”

ఇదంతా అరుగుమీంచి వింటున్న చాణక్యుడికి గ్యానొదయమయ్యింది. తను చేసిన తప్పు తెలుసుకున్నాడు. బలవంతులైన నందులతో యుద్ధం చేసేటప్పుదు వాళ్ళకు బాగా పట్టు వున్న పాట్లిపుత్ర మీద దండి చేస్తే కలిగేది నిరాశే అని అర్ధం చేసుకున్నాడు. ఆ తరువాత చంద్రగుప్తుడితో కలిసి చుట్టు పక్కలున్న చిన్న చిన్న రాజ్యాలను ఆక్రమిస్తూ నెమ్మదిగా పాట్లిపుత్ర మీద యుద్ధం ప్రకటించి విజయాన్ని సాధించాడు.

ఈ సంఘటన భారత దేశ చరిత్రనే మార్చేసింది.